News June 4, 2024
175 సీట్లు గెలిస్తే ఎంత బాధ్యత ఉంటుందో.. ఇప్పుడూ అంతే ఉంది: పవన్

AP: ఏపీ ప్రజలు తనకు చాలా పెద్ద బాధ్యత ఇచ్చారని జనసేనాని పవన్ కళ్యాణ్ అన్నారు. ‘మెగా డీఎస్సీ ఇప్పించే బాధ్యత నాది. సీపీఎస్ విషయంలో ఉద్యోగులకు న్యాయం చేస్తాం. ఏరు దాటాక తెప్ప తగలేసే బుద్ధి నాకు లేదు. 175 సీట్లు గెలిస్తే ఎంత బాధ్యత ఉందో ఇప్పుడూ అంతే ఉంది. మా పాలనలో శాంతి భద్రతలు చాలా బలంగా ఉంటాయి. వ్యవస్థల్లో రాజకీయ జోక్యం ఉండదు’ అని పవన్ స్పష్టం చేశారు.
Similar News
News November 20, 2025
పోలి పాడ్యమి ఎప్పుడు జరుపుకోవాలంటే..?

పోలి పాడ్యమిని నవంబర్ 21వ తేదీన(శుక్రవారం) జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు. ‘పాడ్యమి తిథి నవంబర్ 20 ఉదయం 10:30కి ప్రారంభమై, నవంబర్ 21 మధ్యాహ్నం 12:45 వరకు ఉంటుంది. సూర్యోదయాన్ని పరిగణనలోకి తీసుకొని నవంబర్ 21నే పోలి పాడ్యమి నిర్వహించాలి. ఇక నవంబర్ 22, 2025 శనివారం తెల్లవారుజామున 4:35 నుంచి 6:00 గంటల వరకు దీపాలను నీటిలో వదలడానికి అనుకూల సమయం’ అని చెబుతున్నారు.
News November 20, 2025
ఫోన్‌పే టాప్!

మన దేశంలో యూపీఐ చెల్లింపుల్లో ఫోన్‌పే ఆధిపత్యం కొనసాగుతోంది. 45.47% మార్కెట్ షేర్‌తో అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత గూగుల్ పే (34.62%), పేటీఎం (7.36%), Navi (2.78%), సూపర్ మనీ (1.28%) ఉన్నాయి. ఫోన్‌పే, గూగుల్ పే కలిపి 80 శాతానికి పైగా మార్కెట్ షేర్‌ను కలిగి ఉండటం విశేషం. BHIM, CRED లాంటి ప్లాట్‌ఫామ్స్ కూడా వినియోగిస్తున్నారు. మరి మీరు ఏది వాడుతున్నారో కామెంట్ చేయండి.
News November 20, 2025
తెలుగు రాష్ట్రాల్లో రాష్ట్రపతి ముర్ము పర్యటన

ఏపీ, తెలంగాణలో పలు కార్యక్రమాల్లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పాల్గొననున్నారు. 22న పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో జరగనున్న సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాలకు ఆమె హాజరవుతారని రాష్ట్రపతి కార్యాలయం ప్రకటించింది. తొలుత 21న హైదరాబాద్‌లో ‘భారతీయ కళామహోత్సవ్- 2025’ను రాష్ట్రపతి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించనున్నారు. అనంతరం శనివారం పుట్టపర్తికి వెళ్లనున్నారు.


