News November 26, 2024

రూ.27 కోట్లలో రిషభ్ చేతికి వచ్చేది ఎంతంటే..

image

IPL చరిత్రలోనే అత్యధిక ధర పలికిన ఆటగాడిగా రిషభ్ పంత్ చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. లక్నో అతడిని రూ.27 కోట్లకు కొనుగోలు చేసింది. దీనిలో రూ.8.1 కోట్లు పన్నుగా వెళ్లిపోగా పంత్ చేతికి రూ.18.9 కోట్లు అందుతాయి. ఒకవేళ టోర్నీకి ముందే గాయపడినా, వ్యక్తిగత కారణాలతో తప్పుకొన్నా ఆ డబ్బు రాదు. టోర్నీ మధ్యలో గాయపడి తప్పుకుంటే మాత్రం చెల్లిస్తారు. భారత మ్యాచ్‌లకు ఆడుతూ గాయపడినా డబ్బు దక్కుతుంది.

Similar News

News November 28, 2025

వనపర్తి : నామినేషన్‌ ఉపసంహరణకు ఒత్తిడి చేయొద్దు: కలెక్టర్‌

image

జిల్లాలో నామినేషన్‌ వేయకుండా అడ్డుకున్నా, వేసిన అభ్యర్థిని బలవంతంగా ఉపసంహరించుకునేలా చేసినా, ఎన్నికల ప్రవర్తన నియమావళి ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఆదర్శ్ సురభి హెచ్చరించారు. దీనిపై నిఘా పెట్టేందుకు అధికారులతో స్పెషల్ సెల్‌ ఏర్పాటు చేశామన్నారు. ఉపసంహరణ తర్వాత ఒకే నామినేషన్‌ మిగిలితే, స్పెషల్ సెల్ ద్వారా విచారణ జరుపుతామని తెలిపారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా సహకరించాలన్నారు.

News November 28, 2025

ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు

image

*నూర్‌బాషా, దూదేకుల సహకార ఫైనాన్స్ కార్పొరేషన్‌కు ఆమోదం
*తిరుపతి ఎస్వీ వర్సిటీలో లైవ్‌స్టాక్ రీసెర్చ్ కేంద్రం ఏర్పాటు
*ఖరీఫ్ అవసరాలకు మార్క్‌ఫెడ్ ద్వారా రూ.5వేల కోట్ల రుణ ప్రతిపాదనకు ఆమోదం
*పవర్ ప్రాజెక్టుల ఏర్పాటు, పట్టణాభివృద్ధి శాఖలో చట్టసవరణలకు ఆమోదం

News November 28, 2025

వరి మాగాణుల్లో మినుము, పెసర ఎప్పుడు వెదజల్లాలి?

image

ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా ప్రాంతాల్లో వరి కోయడానికి వారం, 10 రోజుల ముందు నుంచి బురద పదునులో మినుము మరియు పెసర లాంటి పప్పుజాతి పైర్ల విత్తనాలను శుద్ధి చేసి సమానంగా వెదజల్లుకోవాలి. పెసర అయితే ఎకరానికి 10 నుంచి 12 కిలోల విత్తనాలు, మినుములు ఎకరానికి 16 నుంచి 18 కిలోల విత్తనాలు అవసరమవుతాయి. తెగుళ్ల నుంచి రక్షణకు కిలో విత్తనానికి 30 గ్రాముల కార్బోసల్ఫాన్ పొడిమందును పట్టించి విత్తనశుద్ధి చేసుకోవాలి.