News August 2, 2024
NPSతో ఎంత పన్ను ఆదా అవుతుందంటే..

జాతీయ పెన్షన్ పథకం(NPS)ను ఎంచుకునే వేతనజీవులకు అదనపు పన్ను ప్రయోజనాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల బడ్జెట్లో ప్రకటించారు. ఉద్యోగులకు ప్రస్తుతం మూలవేతనంలో సంస్థ తరఫు డిడక్షన్ 10శాతం ఉండగా దాన్ని 14శాతానికి పెంచారు. మీ మూల వేతనం నెలకు రూ.25వేలు అనుకుంటే మీకు ఇదివరకటికంటే రూ.624, రూ.50వేలకు రూ.2496, రూ.లక్షకు రూ.9984, రూ.3లక్షలకు రూ.49,421, రూ.6లక్షలకు రూ.1,03,334 అదనంగా ఆదా కానున్నాయి.
Similar News
News November 28, 2025
కయ్యానికి కాలు దువ్వుతున్న నేపాల్

భారత భూభాగాలను తమవిగా పేర్కొంటూ నేపాల్ కయ్యానికి కాలు దువ్వుతోంది. ఆ దేశం రూ.100 నోట్లను రిలీజ్ చేయగా, వాటిపై కాలాపానీ, లిపులేఖ్, లింపియాధురా ప్రాంతాలు తమవే అన్నట్లు మ్యాప్‌ను ముద్రించింది. 2020లో అప్పటి PM కేపీ శర్మ ఓలీ మ్యాప్‌ను సవరించగా, దాన్ని ఇప్పుడు నోట్లపై ప్రింట్ చేశారు. ఈ చర్యను ఖండించిన భారత్.. ఆ 3 ప్రాంతాలు IND అంతర్భాగాలని పేర్కొంది. నేపాల్ నిర్ణయం ఆమోదయోగ్యం కాదని చెప్పింది.
News November 28, 2025
బతుకమ్మ కుంటపై HCకు హాజరవుతా: రంగనాథ్

TG: బతుకమ్మ కుంట వివాదంలో DEC 5వ తేదీలోపు కోర్టు ముందు హాజరు కావాలని, లేకపోతే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తామని హైడ్రా రంగనాథ్‌ను HC ఆదేశించిన విషయం తెలిసిందే. దీనిపై ఆయన స్పందిస్తూ.. ‘నాపై ఇప్పటికే 30కి పైగా కేసులున్నాయి. కబ్జాదారులు అడ్డంకులు సృష్టిస్తున్నారు. లీగల్‌గా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా చెరువులను అభివృద్ధి చేస్తాం. బతుకమ్మ కుంటపై కోర్టుకు హాజరై అన్ని విషయాలు వివరిస్తాం’ అని చెప్పారు.
News November 28, 2025
డ్రెస్సునో, లిప్‌స్టిక్‌నో నిందించొద్దు: ఐశ్వర్య రాయ్

వీధుల్లో మహిళలను వేధించే ఘటనలపై బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్ స్పందించారు. డ్రెస్సింగ్ ఆధారంగా బాధితులనే నిందించడాన్ని తప్పుబట్టారు. ‘సమస్య కళ్లలోకి నేరుగా చూడండి. తల పైకి ఎత్తండి. మీ విలువను ఎప్పుడూ తగ్గించుకోకండి. మిమ్మల్ని మీరు అనుమానించకండి. మీ డ్రెస్సునో, మీరు పెట్టుకున్న లిప్‌స్టిక్‌నో నిందించవద్దు. వీధుల్లో ఎదురయ్యే వేధింపులు మీ తప్పు ఎన్నటికీ కాదు’ అని మహిళలకు ఆమె సూచించారు.


