News August 17, 2024
చెప్పింది ఎంత.. చేసింది ఎంత? (2/2)

TG: రూ.31 వేలకోట్లు మాఫీ చేస్తామని చెప్పిన ప్రభుత్వం బడ్జెట్లో రూ.26 వేలకోట్లు కేటాయించింది. అయితే ప్రభుత్వం రూ.18 వేలకోట్లు విడుదల చేసి మాఫీ చేసేసినట్టు చెబుతోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో BJPలో BRS విలీనం అంటూ కాంగ్రెస్ దాడి ప్రారంభించింది. కాంగ్రెస్ వ్యూహానికి తగ్గట్టుగానే BRSని విలీనం చేసుకోవడం లేదని BJP, అవాస్తవమని BRS వివరణ ఇచ్చేందుకే ప్రాధాన్యమివ్వడం గమనార్హం.
Similar News
News November 23, 2025
మంత్రుల వాట్సాప్ గ్రూపులు హ్యాక్

తెలంగాణ మంత్రులు, పలు శాఖల అధికారిక వాట్సాప్ గ్రూపులు హ్యాక్ అయ్యాయి. SBI ఆధార్ అప్డేట్ పేరుతో ప్రమాదకర APK ఫైల్స్ షేర్ అయ్యాయి. ఆ ఫైల్స్ను ఓపెన్ చేయవద్దని పోలీసులు సూచిస్తున్నారు. అప్పటికే ఓపెన్ చేసిన పలువురు జర్నలిస్టులు.. తమ ఫోన్లు హ్యాక్ అయినట్లు ఫిర్యాదులు చేస్తున్నారు.
News November 23, 2025
వరి, పత్తి పంటల్లో బోరాన్ లోపం ఇలా గుర్తించండి

☛ వరి: బోరాన్ లోపం వల్ల వరి లేత ఆకుల చివర్లో తెల్లగా మారి వంకర్లు తిరుగుతాయి. వరి పొట్ట దశ నుంచి ఈత దశలో పుప్పొడి ఉత్పత్తి తగ్గి గింజ గట్టిపడక కుదురులోని అన్ని పిలకలు తాలుగా మారతాయి. ☛ పత్తి: లేత చిగుర్లు చిగురించవు. మొగ్గల పెరుగుదల ఆగిపోయి పక్కల నుంచి మొగ్గలు వస్తాయి. లేత ఆకుల చివర్లు, లేత మొగ్గలు దళసరిగా మారి, కుళ్లుతున్నట్లు కనిపిస్తాయి. కాయలపై పగుళ్లు ఏర్పడతాయి.
News November 23, 2025
ముత్తుసామి సూపర్ సెంచరీ

రెండో టెస్టులో దక్షిణాఫ్రికా ప్లేయర్లు భారత బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తున్నారు. ముత్తుసామి(101*) క్రీజులో పాతుకుపోయి సెంచరీతో అదుర్స్ అనిపించారు. ఇది అతడికి తొలి టెస్ట్ సెంచరీ. మార్కో జాన్సన్(49*) సిక్సర్లతో విరుచుకుపడుతున్నారు. INDకు ఈ మ్యాచ్ తప్పక గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా ఇండియన్ బౌలర్లు విజృంభించి వికెట్లు తీయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ప్రస్తుతం RSA స్కోర్ 418/7గా ఉంది.


