News September 6, 2025
GST 2.0తో ప్రభుత్వానికి ఎంత నష్టమంటే?

GST 2.0 ప్రభుత్వానికి కచ్చితంగా భారం కాకమానదు. కేంద్రం అంచనాల ప్రకారం ఏడాదికి నికర ఆర్థిక ప్రభావం రూ.48 వేల కోట్లుగా ఉంది. కానీ వినియోగం, వృద్ధిని లెక్కలోకి తీసుకుంటే GST 2.0తో కేంద్రానికి కనీసం రూ.3,700 కోట్లు నష్టముంటుందని SBI అంచనా వేసింది. ఇది ఆర్థిక లోటుపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపదని స్పష్టం చేసింది. 2026-27లో ద్రవ్యోల్బణం 65-75 బేసిస్ పాయింట్లు తగ్గే అవకాశమున్నట్లు పేర్కొంది.
Similar News
News September 6, 2025
ఉపవాసం ఉంటే ఇన్ని ప్రయోజనాలా?

విష్ణువు భక్తుల్లో చాలామంది శనివారం నాడు ఉపవాసం ఉంటారు. దీనివల్ల దైవానుగ్రహం కలుగుతుందని భక్తుల నమ్మకం. అలాగే ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. ‘ఉపవాసం వల్ల శరీర మెటబాలిజం మెరుగుపడుతుంది. క్యాలరీలు బర్న్ అవుతాయి. కొవ్వు తగ్గుతుంది. డయాబెటిస్, BP అదుపులో ఉంటుంది. గ్యాస్, అసిడిటీ, కడుపు ఉబ్బరం నుంచి ఉపశమనం లభిస్తుంది. మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది’ అని చెబుతున్నారు.
News September 6, 2025
బొజ్జ గణపయ్య! మళ్లీ రావయ్యా!

మా పూజలందుకోవడానికి కైలాసం నుంచి భూమి మీదకి వచ్చిన బొజ్జ గణపయ్య! ఇప్పుడు నిన్ను సాగనంపే సమయం ఆసన్నమైంది. భక్తితో నిమజ్జనం చేసి, నిన్ను మళ్లీ వచ్చే సంవత్సరం ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నాం. నువ్వు మీ తల్లి గంగమ్మ ఒడికి చేరి, మళ్లీ వచ్చే ఏడాది మా ఇళ్లలో, గల్లీల్లో అడుగు పెట్టాలని మనసారా కోరుకుంటున్నాం. సర్వ విఘ్నాలను తొలగించి, ఆనందంతో మమ్మల్ని ఆశీర్వదించు. గణపతి బప్పా మోరియా! మళ్లీ రావయ్యా!
News September 6, 2025
బాలాపూర్ లడ్డూ చరిత్ర తెలుసా?

HYD బాలాపూర్‌లో 1980లో తొలిసారిగా గణేశుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. 1994లో మొదటిసారి లడ్డూ వేలం నిర్వహించారు. రూ.450కి స్థానికుడు కొలను మోహన్ రెడ్డి కొనుగోలు చేశారు. లడ్డూను కుటుంబసభ్యులకు ఇవ్వడంతో పాటు వ్యవసాయ క్షేత్రంలో చల్లారు. దీంతో ఆ ఏడాది అన్ని పనుల్లోనూ వారికి మంచి జరిగింది. లడ్డూ పొందడం వల్లే కలిసొచ్చిందని భావించిన ఆ ఫ్యామిలీ.. చాలా సార్లు వేలంలో ఆ లడ్డూను దక్కించుకుంది.