News January 6, 2025
ఒక్క ‘సిరీస్’ ఎంత పని చేసింది
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ.. భారత డ్రెస్సింగ్ రూమ్‌లో తుఫాన్ సృష్టించింది. ఆటగాళ్లపై ఎన్నో విమర్శలకు కారణమైంది. రోహిత్ ఫామ్ కోల్పోవడంతో కెప్టెన్సీ వదిలేయాలని వార్నింగ్లొచ్చాయి. పదేపదే స్లిప్‌లో క్యాచ్ ఇచ్చి ఔటైన కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించాలని, ఓటములకు బాధ్యత వహిస్తూ గంభీర్ కోచ్‌గా దిగిపోవాలని కామెంట్స్ వినిపించాయి. పలువురు మినహా పెద్దగా ఎవరూ రాణించకపోవడంతో ఫ్యాన్స్, మాజీల నుంచి ఆగ్రహం వ్యక్తమైంది.
Similar News
News January 7, 2025
ఈ తెలుగు IASను అభినందించాల్సిందే!
సివిల్ సర్వీసెస్ అంటే ఓ బాధ్యత అని నిరూపించారు TGలోని కరీంనగర్‌కు చెందిన IAS నరహరి. మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఆయన సెకండ్ అటెంప్ట్‌లో 78వ ర్యాంకు సాధించి MPలో కలెక్టర్‌గా చేస్తున్నారు. 10 ఏళ్లపాటు ప్రభుత్వ కోచింగ్ సెంటర్లలో టీచింగ్ చేసి 400 మంది UPSC ఉత్తీర్ణులవడంలో సహాయం చేశారు. లింగనిర్ధారణ పరీక్షలను అరికట్టేందుకు కృషి చేశారు. ఇండోర్‌ను క్లీనెస్ట్ సిటీగా మార్చేందుకు ఎన్నో కార్యక్రమాలు చేశారు.
News January 7, 2025
ఇంకెప్పుడు విశాల్‌ను కలవొద్దనుకున్నా: దర్శకుడు సుందర్
తొలిసారి విశాల్‌ను కలిసేందుకు వెళ్లినప్పుడు తన ఆఫీసులో లేకపోవడం కోపాన్ని తెప్పించినట్లు ‘మదగదరాజు’ దర్శకుడు సుందర్ తెలిపారు. అప్పుడే ఇక ఆయనను కలవొద్దని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. అయితే 2 నెలల తర్వాత విశాల్ తన వద్దకు వచ్చి సారీ చెప్పాడన్నారు. తన సన్నిహితులకు మెడికల్ ఎమర్జెన్సీ వల్ల ఆ రోజు అందుబాటులో లేరని ఆయన ద్వారా తెలిసిందన్నారు. విశాల్ మంచి వ్యక్తి అని, తన తమ్ముడి లాంటి వాడన్నారు.
News January 7, 2025
మరో క్షిపణిని పరీక్షించిన నార్త్ కొరియా
ఉత్తర కొరియా మరో హైపర్సోనిక్ క్షిపణిని పరీక్షించింది. దేశ అధికారిక మీడియా KCNA ఈ విషయాన్ని ప్రకటించింది. శబ్దవేగానికి 12 రెట్లు వేగంతో 1500 కి.మీ దూరం ప్రయాణించిన క్షిపణి లక్ష్యాన్ని కచ్చితత్వంతో ఛేదించిందని పేర్కొంది. అయితే, క్షిపణి పరీక్ష నిజమే కానీ ప్యాంగ్యాంగ్ చెప్పే స్థాయిలో దాని సామర్థ్యం లేదని దక్షిణ కొరియా కొట్టిపారేసింది. అయితే ఆ ప్రయోగాలపై మాత్రం ఆందోళన వ్యక్తం చేసింది.