News September 12, 2025

గర్భిణులు ఎలా పడుకోవాలంటే..

image

ప్రెగ్నెన్సీలో ఎడమ పక్కకి పడుకోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. దీనివల్ల కడుపులోని బిడ్డకు రక్తప్రసరణ బాగా జరుగుతుంది. వ్యర్థ పదార్థాలు కూడా మూత్రాశయాన్ని చేరుకోవడం సులభమవుతుంది. కాళ్లు, చేతుల వాపు తగ్గుతుంది. మూడో త్రైమాసికంలో సరైన నిద్ర కోసం దిండ్లను ఉపయోగించవచ్చు. దీంతో పాటు మెటర్నటీ బెల్ట్, నైట్ బ్రా కూడా మంచి నిద్రకు సహకరిస్తాయి. పడుకోవడానికి కనీసం గంట ముందే డిన్నర్ పూర్తి చేయాలి.

Similar News

News April 10, 2026

మచ్చలున్న మామిడి పండ్లు తింటున్నారా?

image

మార్కెట్లో కనిపించే కొన్ని మామిడి పండ్లపై నల్లటి మచ్చలు కనిపిస్తుంటాయి. తోటలో ఎక్కువ తేమ కారణంగా మామిడి కాయలు చెట్టుపై ఉన్నప్పుడే ఫంగస్, బాక్టీరియా వల్ల ఈ మచ్చలు ఏర్పడతాయి. దీంతో పండ్లు దెబ్బతింటాయి. ఇవి తింటే అనారోగ్యం బారినపడే ప్రమాదం ఉంది. ఇలాంటి వాటిని కొనకపోవడం బెటర్. ఇక మామిడి రైతులు నల్ల మచ్చలు వచ్చిన కాపునకు నీళ్లు ఎక్కువ పెట్టొద్దు.

News April 10, 2026

ఎల్లుండి ఇంటర్ ఫలితాలు

image

తెలంగాణలో ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు ఈ నెల 12న రిలీజ్ కానున్నాయి. ఈ విషయాన్ని ఇంటర్మీడియట్ బోర్డు వెల్లడించింది. ఫిబ్రవరి 26 నుంచి మార్చి 18 వరకు పరీక్షలు జరిగాయి. 9.97 లక్షల మంది విద్యార్థులు ఈసారి ఎగ్జామ్స్ రాశారు. అత్యంత వేగంగా, సులువుగా Way2newsలో మీ ఫలితాలు తెలుసుకోండి.

News April 10, 2026

TV దగ్గర దోమల బ్యాట్ ఎందుకు వాడొద్దంటే..

image

బ్యాట్ దోమను చంపినప్పుడు వచ్చే చిన్న స్పార్క్ ఒక ‘మినీ ఎలక్ట్రోమాగ్నెటిక్ పల్స్’ (EMP)ను సృష్టిస్తుంది. ఇది LED లేదా OLED TV స్క్రీన్‌లోని ట్రాన్సిస్టర్లు, టీ-కాన్ బోర్డును నాశనం చేస్తుంది. స్క్రీన్ ప్యానెల్ అంచుల్లో ఉండే సన్నని కాపర్ వైర్లు ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీని గ్రహించి షార్ట్ సర్క్యూట్‌కు దారితీస్తాయి. దీంతో స్క్రీన్‌పై నల్లటి గీతలు రావడం లేదా డిస్‌ప్లే పూర్తిగా ఆగిపోయే అవకాశం ఉంది.