News October 26, 2024
చైనాతో ఒప్పందం ఎలా సాధ్యమైందంటే..: ఎస్ జైశంకర్

తూర్పు లద్దాక్లోని వాస్తవాధీన రేఖ వెంబడి గస్తీ ఉపసంహరణ విషయంలో చైనా, భారత్ మధ్య ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. రెండు అంశాలు ఆ ఒప్పందం కుదరడంలో కీలక పాత్ర పోషించాయని ఆయన తెలిపారు. ‘మన సైన్యం అత్యంత కష్టమైన పరిస్థితుల్లోనూ పట్టుదలతో నిలబడింది. ఒప్పందం వెనుక భారత సైన్యమే తొలి కారణం. ఇక సరిహద్దు వెంబడి దశాబ్దకాలంగా మనం అభివృద్ధి చేసుకున్న మౌలిక వసతులు రెండో కారణం’ అని వివరించారు.
Similar News
News January 2, 2026
ఎల్లుండి చిరంజీవి కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్

మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా ట్రైలర్ను ఈనెల 4న రిలీజ్ చేయనున్నట్లు మూవీ టీమ్ తెలిపింది. చిరంజీవి గన్ పట్టుకున్న పోస్టర్ను రిలీజ్ చేసింది. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ మూవీలో నయనతార హీరోయిన్గా, విక్టరీ వెంకటేశ్ గెస్ట్ రోల్లో కనిపించనున్నారు. సాహూ గారపాటి నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా ఈ నెల 12న థియేటర్లలోకి రానుంది. భీమ్స్ మ్యూజిక్ అందించారు.
News January 2, 2026
282 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

CSI ఈ గవర్నెన్స్ సర్వీస్ ఇండియా లిమిటెడ్ 282 ఆధార్ సూపర్ వైజర్/ఆపరేటర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం పోస్టుల్లో ఏపీలో 4, తెలంగాణలో 11 పోస్టులు ఉన్నాయి. 18ఏళ్లు నిండిన విద్యార్హత గల అభ్యర్థులు జనవరి 31 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి టెన్త్+ITI, ఇంటర్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వెబ్సైట్: https://cscspv.in
News January 2, 2026
పవన్ హక్కుల ఉల్లంఘన పోస్టులు తొలగించాలి: ఢిల్లీ హైకోర్టు

AP Dy CM <<18640929>>పవన్<<>> కళ్యాణ్ వ్యక్తిగత హక్కులను పరిరక్షించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. పవన్ అభిమానులు కూడా హక్కుల ఉల్లంఘన చేస్తున్నారని జస్టిస్ మన్మీత్ ప్రీతమ్ సింగ్ ధర్మాసనం పేర్కొంది. SM వినియోగదారులు అభిమానుల ఖాతాల ద్వారా వాటిని పోస్టు చేస్తున్నారన్న వాదనను తిరస్కరించింది. కాగా పవన్ వ్యక్తిగత హక్కులను ఉల్లంఘించేలా ఉన్న కంటెంట్ను తొలగించాలని మెటా, గూగుల్, ఎక్స్ సంస్థలను కోర్టు ఆదేశించింది.


