News October 8, 2024

కొనేదెలా? వండేదెలా? అమ్మేదెలా?

image

తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన కూరగాయల ధరలతో సామాన్యులు సతమతమవుతున్నారు. ప్రతి కూరలోకి పక్కా అన్నట్లుండే ఉల్లి Kg ₹60, టమాటా ₹100కు చేరడంతో ఇవి లేకుండా అసంతృప్తిగా తింటున్నారు. ఇక కర్రీ పాయింట్ నిర్వాహకుల పాట్లు మరోలా ఉన్నాయి. కూరల రేట్లు పెంచితే కొనేవారు తగ్గుతున్నారని వారు వాపోతున్నారు. అటు నవరాత్రులతో చాలాచోట్ల అన్నదానాలు జరుగుతుండటంతో, అమ్మ దయతో పొట్ట నింపుకుంటున్నట్లు బ్యాచిలర్స్ చెబుతున్నారు.

Similar News

News April 3, 2026

GK: భారత విమానయాన పితామహుడు ఎవరు?

image

⋆ అతిపెద్ద విమానాశ్రయం: రాజీవ్ గాంధీ (శంషాబాద్, సుమారు 5,500 ఎకరాలు)
⋆ భారత విమానయాన పితామహుడు- JRD టాటా
⋆ తొలి విమాన ప్రయాణం: 1911, FEB 18 (అలహాబాద్-నైనీ)
⋆ తొలి విమానయాన సంస్థ: టాటా ఎయిర్‌లైన్స్
⋆ తొలి ఉమెన్ పైలట్: సరళా థక్రాల్
⋆ పౌర విమానయానాన్ని నియంత్రించే సంస్థ: డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA)
⋆ ఎయిర్ పోర్టుల నిర్వహణను చూసే సంస్థ: ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI)

News April 3, 2026

రేపటి నుంచి రబీ కొనుగోళ్లు.. 8 గంటల్లోనే ఖాతాల్లో డబ్బు: నాదెండ్ల

image

AP: రాష్ట్రవ్యాప్తంగా రేపటి నుంచి రబీ సీజన్ ధాన్యం కొనుగోళ్లను ప్రారంభించనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ‘1,917 కేంద్రాల ద్వారా 23 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణే లక్ష్యం. రైతుల కోసం 5.40 కోట్ల గన్నీ బ్యాగులను సిద్ధంగా ఉంచాం. 17,262 వాహనాలు అందుబాటులో ఉంటాయి. ధాన్యం కొనుగోలు చేసిన 8 గంటల్లోపే అన్నదాతల ఖాతాల్లో డబ్బు జమ చేస్తాం’ అని SMలో పోస్టు చేశారు.

News April 3, 2026

‘వీరభద్రుడు’గా సూర్య.. రిలీజ్ ఎప్పుడంటే?

image

ఆర్జే బాలాజీ దర్శకత్వంలో సూర్య నటిస్తున్న ‘కరుప్పు’ సినిమాకు తెలుగులో ‘వీరభద్రుడు’ అనే టైటిల్ ఖరారైంది. ఈ విషయాన్ని వెల్లడిస్తూ మూవీ టీమ్ ఓ స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఇందులో సూర్య మీసం మెలేసి చేతిలో కత్తి పట్టుకొని ఉన్నారు. మే 14న సినిమాను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ మూవీలో త్రిష హీరోయిన్. సాయి అభ్యంకర్ మ్యూజిక్ అందిస్తున్నారు.