News May 30, 2024

వీవీప్యాట్‌ స్లిప్పుల లెక్కింపు ఎలా?

image

VVPAT సిస్టమ్ 2013 నుంచి వినియోగంలోకి వచ్చింది. ఈవీఎంలకు అనుసంధానమైన ఈ యంత్రం అభ్యర్థి పేరు, ఎన్నికల గుర్తుతో స్లిప్‌‌ను రూపొందిస్తుంది. ఈవీఎం ఓట్ల లెక్కింపు పూర్తైన తర్వాత నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రాల నంబర్స్‌ను చీటీలపై రాసి లాటరీ తీస్తారు. ఇలా ఎంపిక చేసిన VVPATలలోని స్లిప్పులు లెక్కించి ఈవీఎం రిజల్ట్‌తో సరిపోల్చుతారు. ఈవీఎం, స్లిప్‌ల ఓట్లలో వ్యత్యాసం ఉంటే స్లిప్పులనే పరిగణనలోకి తీసుకుంటారు.

Similar News

News October 14, 2024

కొండా సురేఖపై కేటీఆర్ పిటిషన్.. విచారణ వాయిదా

image

TG: మంత్రి కొండా సురేఖపై కేటీఆర్ దాఖలు చేసిన పరువునష్టం దావా పిటిషన్‌పై నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. ఈ నెల 18న కేటీఆర్‌తో పాటు నలుగురు సాక్షులు బాల్క సుమన్, సత్యవతి రాథోడ్, తుల ఉమా, దాసోజు శ్రవణ్ స్టేట్‌మెంట్లను కోర్టు రికార్డు చేయనుంది. తదుపరి విచారణను 18కి వాయిదా వేసింది.

News October 14, 2024

టీడీపీ ఆఫీసుపై దాడి కేసు.. ప్రధాన నిందితుడు సరెండర్

image

AP: టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో ప్రధాన నిందితుడు, MLC లేళ్ల అప్పిరెడ్డి అనుచరుడు పానుగంటి చైతన్య మంగళగిరి కోర్టులో లొంగిపోయారు. YCP విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న చైతన్య ఈ దాడిలో ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. కూటమి ప్రభుత్వం రాగానే ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారు. ఇదే కేసులో అప్పిరెడ్డి, తలశిల రఘురామ్, దేవినేని అవినాశ్ ఇవాళ మంగళగిరి PSలో విచారణకు హాజరయ్యారు.

News October 14, 2024

క్యాన్సర్ ట్రీట్‌మెంట్.. కనురెప్పలు కోల్పోయిన నటి

image

స్టేజ్-3 బ్రెస్ట్ క్యాన్స్‌ర్‌తో బాధపడుతున్న బాలీవుడ్ నటి హీనా ఖాన్‌కు కీమో థెరపీ కొనసాగుతోంది. అత్యంత కఠినమైన ఈ చికిత్స సందర్భంగా ఆమె ఇప్పటికే తన జుట్టును కోల్పోయారు. తాజాగా ట్రీట్‌మెంట్ ఫైనల్ స్టేజ్‌లో తన కనురెప్పలు కూడా పోయాయంటూ ఆమె అందుకు సంబంధించిన ఫొటోను షేర్ చేశారు. దీంతో ‘మీరొక వారియర్. త్వరలోనే కోలుకుంటారు’ అంటూ ఆమె అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.