News September 27, 2025

మొక్కల్లో పొటాషియం, మెగ్నీషియం లోపాన్ని ఎలా గుర్తించాలి?

image

మొక్కల్లో పొటాషియం లోపం వల్ల ఆకుల అంచులు గోధుమ రంగులోకి మారి ఎండి, ముడుచుకుపోతాయి. మొక్కల పెరుగుదల లోపించి చీడపీడలు త్వరగా ఆశిస్తాయి. మెగ్నీషియం ఆకులోని పత్రహరితం తయారీకి కీలకం. ఇది లోపిస్తే ఆకుల ఈనెల మధ్యభాగంలో ఎర్రని/గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. తర్వాత ఆకులు వికృతంగా పసుపు రంగులోకి మారి ఎండి రాలిపోతాయి. మొక్క బలహీనంగా మారి పువ్వులు, కాయల అభివృద్ధి ఆశించినమేర ఉండదు.

Similar News

News February 10, 2026

ఇదేం పని: బాయ్‌ఫ్రెండ్‌కు తల్లి, పెద్దమ్మ ప్రైవేట్ ఫొటోలు!

image

ప్రేమ మోజులో ఈకాలం పిల్లలు ఏం చేస్తున్నారో కూడా అర్థం కావడం లేదు. బెంగళూరుకు చెందిన ఓ యువతి తన బాయ్‌ఫ్రెండ్‌కు ఏకంగా సొంత తల్లి, పెద్దమ్మ ప్రైవేట్ ఫొటోలు పంపడం అందరినీ షాక్‌కి గురిచేస్తుంది. ఆన్‌లైన్ క్లాసుల కోసం కొనిచ్చిన ఫోన్‌తో గంటల తరబడి మాట్లాడుతుండటంతో తల్లిదండ్రులకు అనుమానం వచ్చింది. మందలించి ఫోన్ చెక్ చేయగా విషయం బయటపడింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

News February 10, 2026

SBI 256 పోస్టులకు నోటిఫికేషన్

image

<>SBI <<>>256 FLC కౌన్సిలర్స్, FLC డైరెక్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగాలను కాంట్రాక్ట్ విధానంలో ఈ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత గలవారు ఫిబ్రవరి 26వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 60 నుంచి 63ఏళ్ల మధ్య ఉండాలి. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ, మెరిట్ లిస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://sbi.bank.in

News February 10, 2026

8 నెలల ప్రెగ్నెన్సీతో పోటీ.. పతకాలు సొంతం

image

కర్ణాటకకు చెందిన మేఘనా సజ్జనార్ 8 నెలల ప్రెగ్నెన్సీతో క్రీడా పోటీల్లో పాల్గొని అదరగొట్టారు. ఆసియా షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్‌ వ్యక్తిగత విభాగంలో బ్రాంజ్, టీమ్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించారు. టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ స్ఫూర్తి, వైద్యుల సలహాతోనే ధైర్యంగా పోటీల్లో పాల్గొన్నట్లు ఆమె తెలిపారు. కుటుంబం, కోచ్‌ల ప్రోత్సాహంతోనే మెడల్ సాధించినట్లు పేర్కొన్నారు.