News May 23, 2024
పునుగు పిల్లి నుంచి నూనె ఎలా తీస్తారంటే..

వేల ఏళ్ల నాటి శ్రీనివాసుడి విగ్రహం నేటికీ కాంతులీనడం వెనుక పునుగు తైలాభిషేకం కూడా ఓ కారణమంటారు పండితులు. పునుగు పిల్లి చర్మంపై 10రోజులకోసారి చెమట పేరుకుపోతుంది. ఆ సమయంలో దాన్ని ఓ ఇనుప జల్లెడలో పెట్టి పక్కనే గంధపు చెక్కను ఉంచుతారు. పేరుకుపోయిన పునుగు(సుగంధ ద్రవ్యం)ని ఆ చెక్కకు రుద్దడం ద్వారా పిల్లి వదిలించుకుంటుంది. చెక్కకు బంకలా అంటుకున్న ఆ పునుగు నుంచి తీసిన తైలాన్ని శ్రీవారికి అభిషేకిస్తారు.
Similar News
News November 27, 2025
చరిత్ర సృష్టించిన నిఖత్ జరీన్

ఇండియన్ స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ మరోసారి తన ప్రతిభతో ప్రపంచాన్ని ఆకట్టుకుంది. తాజా వరల్డ్ బాక్సింగ్ కప్ ఫైనల్స్ 2025లో స్వర్ణం గెలిచారు నిఖత్. పారిస్ ఒలింపిక్స్ తర్వాత విరామం తీసుకున్న నిఖత్, తిరిగి రింగ్‌లో అడుగుపెట్టి తన పంచ్ పవర్‌తో ప్రత్యర్థులను చిత్తు చేసింది. దాదాపు 21 నెలల తర్వాత అంతర్జాతీయ వేదికపై నిఖత్ పతకం సాధించడం విశేషం. ఈ మెడల్ భారత మహిళా బాక్సింగ్‌లో మరో మైలురాయిగా నిలిచింది.
News November 27, 2025
గంభీర్‌పై ఇప్పట్లో ఎలాంటి నిర్ణయం ఉండదు: BCCI

తన భవిష్యత్తుపై బీసీసీఐదే <<18393677>>నిర్ణయమన్న<<>> టీమ్ ఇండియా కోచ్ గంభీర్ వ్యాఖ్యలపై బోర్డు స్పందించింది. ఇప్పట్లో ఎలాంటి నిర్ణయం తీసుకోబోమని ఓ అధికారి వెల్లడించినట్లు NDTV పేర్కొంది. ప్రస్తుతం జట్టు మార్పుల దశలో ఉందని ఆయన తెలిపారు. అయితే కోచ్ మార్పు ఉండదని బీసీసీఐ స్పష్టమైన సంకేతాలిచ్చింది. కాగా భారత్ వరుస టెస్ట్ సిరీస్‌ల ఓటమి నేపథ్యంలో గంభీర్‌ను తొలగించాలంటూ డిమాండ్లు వచ్చాయి.
News November 27, 2025
ఆల్‌టైమ్ రికార్డు స్థాయికి నిఫ్టీ

స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో దూసుకెళ్తున్నాయి. నిఫ్టీ 26,295.55 వద్ద ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది. ఉదయం 9:40 గంటల సమయానికి సెన్సెక్స్ 189 పాయింట్లు ఎగబాకి 85,799 వద్ద కొనసాగుతుండగా, నిఫ్టీ 52 పాయింట్లు పెరిగి 26,251 వద్ద ట్రేడవుతోంది. 2024 సెప్టెంబర్ 27 నాటి రికార్డు గరిష్ఠ స్థాయి 26,277ను అధిగమించింది. విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.16%, స్మాల్ క్యాప్ 0.07% పెరిగాయి.


