News February 11, 2025
రైతులకు యూనిక్ కోడ్.. పొందడం ఎలా?

‘ఫార్మర్ రిజిస్ట్రీ’ ప్రాజెక్టులో భాగంగా రైతులకు కేంద్రం 11 నంబర్లతో కూడిన యూనిక్ కోడ్ను కేటాయిస్తోంది. ఈ ప్రక్రియ నిన్న ఏపీలోనూ ప్రారంభమైంది. తొలి రోజు 63వేల మందికి UC జారీ అయినట్లు సమాచారం. దీనికోసం apfr.agristack.gov.in <
Similar News
News December 12, 2025
వీళ్లు పొరపాటున కూడా కీరదోస తినొద్దు!

అజీర్ణ సమస్యలు ఉన్నవాళ్లు కీరదోస తినకూడదని న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు. ఇరిటబుల్ బోవల్ సిండ్రోమ్ ఉన్న వాళ్లు తింటే గ్యాస్, ఉబ్బరం సమస్య వచ్చే ప్రమాదం ఉంది. శరీరాన్ని చల్లబరిచే స్వభావం ఉన్నందున జలుబు, సైనస్ సమస్యలు, బ్రాంకైటిస్, ఉబ్బసం, కఫంతో బాధపడేవాళ్లు, ఎక్కువరోజులు జలుబుతో ఇబ్బందిపడేవాళ్లు తినకూడదు. ముక్కు దిబ్బడ, దగ్గు ఉన్నవాళ్లు తింటే సమస్య ఎక్కువవుతుంది.
News December 11, 2025
తిలక్ వర్మ అద్భుత హాఫ్ సెంచరీ

రెండో టీ20లో తడబడిన భారత్ బ్యాటింగ్ను తెలుగు కుర్రాడు తిలక్ వర్మ గాడిలో పెట్టారు. 44 రన్స్పై ఉండగా అదిరిపోయే సిక్సర్ బాది హాఫ్ సెంచరీ నమోదు చేశారు. బిగ్ ఛేజింగ్ గేమ్లో టాపార్డర్ కుప్పకూలగా పాండ్య(20)తో కలిసి తిలక్ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. జట్టు కష్టాల్లో ఉండగా క్రీజులో పాతుకుపోయి సత్తా చాటుతున్నారు. ఓవైపు వికెట్లు పడుతున్నా జట్టు విజయం కోసం కృషి చేస్తున్నారు.
News December 11, 2025
మయన్మార్ ఆర్మీ దాడులు.. 34 మంది మృతి

తిరుగుబాటు సంస్థ అరకన్ ఆర్మీ టార్గెట్గా మయన్మార్ ఆర్మీ జరిపిన వైమానిక దాడిలో 34 మంది మరణించారు. బుధవారం రాత్రి ఫైటర్ జెట్ రెండు మిస్సైల్స్ వేయడంతో రఖైన్ రాష్ట్రం మ్రౌక్-యు టౌన్షిప్లో అరకన్ ఆర్మీ అధీనంలోని ఆసుపత్రి పూర్తిగా ధ్వంసమైంది. దాడిలో వైద్య సిబ్బంది, పేషెంట్స్ మరణించినట్టు రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. 17 మంది మహిళలు, 17 మంది పురుషులు మృతిచెందగా మరో 80 మంది తీవ్రంగా గాయపడ్డారు.


