News October 1, 2024

తిరుపతిలో పవన్ సభ ఎలా పెడతారు: MP గురుమూర్తి

image

సుప్రీంకోర్టులో లడ్డూ అంశం పెండింగ్‌లో ఉన్నప్పుడు తిరుపతిలో DY CM పవన్ బహిరంగ సభ నిర్వహించడం సరికాదని ఎంపీ గురుమూర్తి ట్వీట్ చేశారు. ‘పవిత్ర తిరుపతి లడ్డూ కల్తీపై సరైన విచారణ కూడా చేయకుండా నిరాధారమైన వ్యాఖ్యలు చేసినందుకు సీఎం చంద్రబాబుపై సుప్రీంకోర్టు మండిపడింది. బాధ్యతాయుతమైన ఉపముఖ్యమంత్రి హోదాలో ఉన్న మీరు ముందే నిర్ధారణకు వచ్చి ప్రాయశ్చిత్త దీక్ష ఎలా చేస్తారు?’ అని ప్రశ్నించారు.

Similar News

News January 20, 2026

APలో RMZ సంస్థ రూ.లక్ష కోట్ల పెట్టుబడులు!

image

AP: రాష్ట్రంలో భారీగా పెట్టుబడులకు RMZ సంస్థ ముందుకొచ్చింది. రూ.లక్ష కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్టు సంస్థ ఛైర్మన్ మనోజ్ మెండా తెలిపారు. దావోస్‌ సమ్మిట్‌లో మంత్రి లోకేశ్‌తో సమావేశం అనంతరం ఈ ప్రకటన చేశారు. విశాఖ కాపులుప్పాడ ఫేజ్-1 ఐటీ పార్క్‌లో 50 ఎకరాల్లో జీసీసీ పార్క్ అభివృద్ధి చేయనున్నట్టు తెలిపారు. 1Gw వరకు హైపర్‌స్కేల్ డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటుకు ప్లాన్‌లు రెడీ చేస్తున్నామని పేర్కొన్నారు.

News January 20, 2026

నైనీ కోల్ టెండర్లపై CBIతో విచారించాలి: రాంచందర్

image

TG: నైనీ కోల్ బ్లాక్‌ టెండర్ల వివాదంతో CM, మంత్రుల విభేదాలు బట్టబయలయ్యాయని TBJP చీఫ్ రాంచందర్ రావు విమర్శించారు. ‘బంధువులకు గనులు కేటాయించుకోవాలని చూశారు. మీడియాలో వార్తలతో టెండర్లు రద్దు చేశారు. దీనిపై CBI, మరేదైన సంస్థతో విచారించాలి’ అని డిమాండ్ చేశారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి లేఖ రాసే అర్హత BRSకు లేదన్నారు. BRS హయాం నుంచి ఇప్పటి INC GOVT వరకు జరిగిన అవినీతిపై విచారణ జరగాలని పేర్కొన్నారు.

News January 20, 2026

ఆ దేశాలనూ అమెరికాలో కలిపేసిన ట్రంప్!

image

యూరోపియన్ దేశాలు, US మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న వేళ ట్రంప్ రిలీజ్ చేసిన AI జనరేటెడ్ మ్యాప్ వైరల్ అవుతోంది. అందులో కెనడా, గ్రీన్‌లాండ్, వెనిజులా US భూభాగానికి చెందినవి అన్నట్లు ఉంది. ఈ ఫొటోను ఆయన ట్రూత్‌లో పోస్ట్ చేశారు. గతేడాది EU లీడర్లతో ట్రంప్ భేటీ కాగా, అప్పటి ఫొటోను మార్ఫ్ చేశారు. ఆ సమయంలో ఫ్రెంచ్ ప్రెసిడెంట్ మాక్రాన్, ఇటలీ PM మెలోని, UK PM కీర్ స్టార్మర్‌ తదితరులతో ట్రంప్ సమావేశమయ్యారు.