News March 11, 2025

6 నెలల్లో ₹6కోట్ల కోట్ల అప్పు తీర్చేదెలా..!

image

డొనాల్డ్ ట్రంప్‌‌కు పెద్దచిక్కే వచ్చిపడింది. 6 నెలల్లోనే ఆయన $7.6T (రూ.6 కోట్ల కోట్లు) అప్పు తీర్చాల్సి ఉంది. అమెరికా మొత్తం అప్పుల్లో ఇది 31%కి సమానం. ఎకానమీ మందగమనం వల్ల దీనినెలా రీఫైనాన్స్ చేయాలా అని ఆయన ఆందోళన చెందుతున్నారని తెలిసింది. సాధారణంగా ప్రభుత్వాలు బాండ్లు, ట్రెజరీ బిల్లుల ద్వారా ప్రజల నుంచి నిధులు సమీకరిస్తుంటాయి. వాటి కాలపరిమితి ముగియగానే వడ్డీ సహా మొత్తం చెల్లించాల్సి ఉంటుంది.

Similar News

News March 27, 2026

బ్లాక్ మార్కెటింగ్ నిరోధానికి చర్యలు.. మోదీతో రేవంత్

image

TGలో పెట్రోల్, డీజిల్‌, గ్యాస్ స‌ర‌ఫ‌రా, బ్లాక్ మార్కెటింగ్ నిరోధానికి CS ఆధ్వ‌ర్యంలో క‌మిటీని ఏర్పాటు చేసినట్లు PM మోదీ టెలికాన్ఫరెన్స్‌లో CM రేవంత్ తెలిపారు. ప్ర‌తి బంక్‌లో స్టాక్, విక్రయాలపై ఎప్ప‌టిక‌ప్పుడు వివరాలు సేకరిస్తున్నట్లు చెప్పారు. ఈవీల వినియోగాన్ని ప్రోత్సహించామని, 100% రోడ్డు ప‌న్ను, రిజిస్ట్రేష‌న్ ఫీజు మిన‌హాయించామ‌న్నారు. ఇకపై RTCలో ఈవీ బస్సులే వాడతామని PM దృష్టికి తీసుకెళ్లారు.

News March 27, 2026

సరిహద్దు రాష్ట్రాలు జాగ్రత్త: మోదీ

image

సరిహద్దు, కోస్టల్ రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని ప్రధాని మోదీ సూచించారు. షిప్పింగ్, నిత్యావసరాల సరఫరా, సముద్ర కార్యకలాపాల విషయంలో ఎదురయ్యే సవాళ్లను పరిష్కరించడంపై దృష్టి పెట్టాలని సీఎంలతో వర్చువల్ మీటింగ్‌లో చెప్పారు. వ్యవసాయ రంగం విషయంలో ముందస్తు ప్రణాళిక అవసరమని తెలిపారు. ఎరువుల స్టోరేజీ, సరఫరాను ఎప్పటికప్పుడు మానిటర్ చేయాలని పేర్కొన్నారు. తప్పుడు సమాచారం వ్యాప్తి చెందకుండా చూసుకోవాలని కోరారు.