News September 10, 2025

‘ఉండ్రాళ్ల తద్ది’ వ్రతం ఎలా చేయాలి?

image

మహిళలు ఈ వ్రతాన్ని ఆచరిస్తే పార్వతీ దేవి సకల సౌభాగ్యాలు వర్ధిల్లే వరమిస్తుందని పండితులు చెబుతున్నారు. ‘మహిళలు నేడు సాయంత్రం వరకు ఉపవాసం ఉండాలి. బియ్యం పిండితో ఉండ్రాళ్లు చేయాలి. గౌరీ దేవిని పూజించి ఆమెకు ఉండ్రాళ్లు నివేదించాలి. ఐదుగురు ముత్తైదువులను పిలిచి చీర, రవికలతో పాటు ఉండ్రాళ్లు వాయనమివ్వాలి. వారి పాదాలకు పసుపు రాసి, ఆశీస్సులు పొంది, అక్షతలు వేయించుకుంటే శుభం కలుగుతుంది’ అని అంటున్నారు.

Similar News

News September 10, 2025

మంచి నిద్ర కోసం చదవాల్సిన శ్లోకం

image

అగస్త్యో మాధవశ్చైవ
ముచకుందో మహామునిః
కపిలో మునిరాస్తీకః
పంచయతే సుఖశాయనః
ఈ ప్రసిద్ధమైన శ్లోకాన్ని పఠించి పడుకుంటే హాయిగా నిద్ర పడుతుందని పండితులు చెబుతున్నారు. మంచి నిద్ర కోసం రుషులను తలచుకోవాలని పెద్దలు చెబుతుంటారు. వారి పేర్లు(అగస్త్య, మాధవ, ముచుకుంద, కపిల, ఆస్తీక) కలిపి ఈ శ్లోకాన్ని రాశారు.

News September 10, 2025

అయ్యప్ప మోకాళ్ల ప‌ట్టీ వెనకున్న కథ

image

అయ్యప్ప స్వామి చిన్ముద్రతోపాటు పట్టు బంధనంతో భక్తులకు దర్శనమిస్తారు. మహిషిని సంహరించిన తర్వాత స్వామి శబరిమల ఆలయంలో కొలువై ఉంటారు. పెంపుడు తండ్రి పందళరాజు తనను చూడటానికి వచ్చినప్పుడు, స్వామివారు లేవబోతారు. అప్పుడు రాజు ఆయనను యోగాసనంలోనే ఉండమని ప్రార్థిస్తూ, భుజాన ఉన్న పట్టువస్త్రాన్ని స్వామి మోకాళ్లకు కట్టి బంధిస్తారు. భక్తులందరికీ ఇదే రూపంలో దర్శనమివ్వాలని ప్రార్థించగా అయ్యప్ప అనుగ్రహించారు.

News September 10, 2025

నేపాల్ రాజ్యాంగాన్ని మార్చాలి: నిరసనకారులు

image

నేపాల్‌లో జెన్-Z యువత నిరసనలు కొనసాగిస్తోంది. తాజాగా వారి నుంచి మరిన్ని <<17651342>>డిమాండ్లు<<>> వినిపిస్తున్నాయి. రాజ్యాంగాన్ని మార్చాలని, దేశంలో 30 ఏళ్ల దోపిడీపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. నిరసనల్లో మరణించిన వారిని అమరవీరులుగా గుర్తించి, పరిహారం ఇవ్వాలని కోరుతున్నారు. దేశ భవిష్యత్తు కోసమే ఈ ఉద్యమమని చెబుతున్నారు. కొత్త రాజకీయ వ్యవస్థ వస్తేనే శాంతి స్థాపన జరుగుతుందని అంటున్నారు.