News September 21, 2025

అరటిలో తెగుళ్ల నివారణ, సస్యరక్షణ ఇలా

image

* సెప్టెంబర్‌లో అరటిలో వైరస్ తెగులు వ్యాప్తి చేసే పేను బంక నివారణకు లీటరు నీటికి మిథైల్‌డెమటాన్ 2ML కలిపి పిచికారీ చేయాలి.
* పచ్చ అరటి, కొవ్వూరు బొంత, కర్పూర చక్కెరకేళి రకాలకు రెండో దఫాగా 100 గ్రా. యూరియా, 80 గ్రా. మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఇచ్చి తేలికపాటి తడి ఇవ్వాలి.
* నులిపురుగుల నివారణకు పశువుల ఎరువుతోపాటు ఒక్కోమొక్కకు 250 గ్రా. వేపపిండి+ 25 గ్రా. పాసిలోమైసిస్ లిలేసినస్ శిలీంధ్రం వేసుకోవచ్చు.

Similar News

News September 21, 2025

24 గంటలు గడవక ముందే మాట మార్చేశారు.. ఎందుకిలా?

image

H1B వీసాల విషయంలో ట్రంప్ ప్రభుత్వ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేసే సమయంలో కామర్స్ సెక్రటరీ <<17768634>>హోవర్డ్<<>> ప్రతి ఏడాది లక్ష డాలర్లు చెల్లించాలని చెప్పారు. కానీ 24 గంటలు తిరగకముందే వైట్‌హౌస్ మరో ప్రకటన చేసింది. కేవలం కొత్త వీసాల కోసం అప్లై చేసే వారికే ఆ ఫీజు వర్తిస్తుందని పేర్కొంది. దీంతో ఏం జరిగింది? ఎందుకు నిర్ణయం మార్చుకున్నారు? అనే సందేహాలు వస్తున్నాయి.

News September 21, 2025

రేపటి నుంచి శ్రీశైలంలో దసరా మహోత్సవాలు

image

AP: శ్రీశైలం మహాక్షేత్రంలో రేపటి నుంచి అక్టోబర్ 2 వరకు దసరా మహోత్సవాలు నిర్వహించనున్నారు. రేపు ఉ.9 గంటలకు అమ్మవారి ఆలయ యాగశాల ప్రవేశంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. మహర్నవమి సందర్భంగా అక్టోబర్ 1న ప్రభుత్వం తరఫున స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పిస్తారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పాల్గొంటారు. అక్టోబర్ 2 దసరా రోజున తెప్పోత్సవంతో ఉత్సవాలు ముగుస్తాయి.

News September 21, 2025

BCCI కొత్త అధ్యక్షుడు ఇతడేనా?

image

జమ్మూకశ్మీర్‌కు చెందిన మాజీ క్రికెటర్ మిథున్ మన్హాస్ బీసీసీఐ అధ్యక్షుడి రేసులో ముందున్నట్లు జాతీయ మీడియా పేర్కొంది. రోజర్ బిన్నీ తర్వాత ఇతడికే పదవి దక్కే ఛాన్స్ ఉంది. ఇవాళ ఢిల్లీలో జరిగే వార్షిక సమావేశంలో కొత్త అధ్యక్షుడి పేరును ప్రకటించనున్నారు. ఢిల్లీ తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడిన మిథున్ 9వేలకు పైగా రన్స్ చేశారు. ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడలేదు. IPL(2008-14)లో ఆడిన తొలి J&K ప్లేయర్‌గా నిలిచారు.