News October 5, 2025
బత్తాయిలో తొడిమ కుళ్లు తెగులును ఎలా నివారించాలి?

తొడిమ కుళ్లు సోకి, రాలిపోయిన కాయలను ఏరి నాశనం చేయాలి. తెగులు నివారణకు లీటరు నీటికి కాపర్ ఆక్సీక్లోరైడ్ 3గ్రా. లేదా కార్బండిజం 1 గ్రాము కలిపి పిచికారీ చేయాలి. ప్రతి సంవత్సరం తొలకరిలో చెట్లలో ఎండుపుల్లలను కత్తిరించి నాశనం చేయాలి. శిలీంధ్రానికి ఆశ్రయమిచ్చే కలుపు మొక్కలను సమర్థవంతంగా అరికట్టేందుకు చెట్ల పాదుల్లో మల్చింగ్ పద్ధతిని అవలంబించాలి. తోటల్లో నీటి ఎద్దడి లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
Similar News
News March 11, 2026
నేను ఎప్పుడనుకుంటే అప్పుడు యుద్ధం ఆగుతుంది: ట్రంప్

ఇరాన్‌పై పోరు త్వరలోనే ముగుస్తుందని US అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. దాడి చేయడానికి అక్కడ ఇంకేమీ మిగల్లేదన్నారు. తాను అనుకున్నప్పుడు యుద్ధం ఆగుతుందని తెలిపారు. హార్ముజ్‌లో బాంబులు పెట్టాలని ఇరాన్ ప్రయత్నించిందని.. కానీ తాము 16 మైన్ బోట్లను ధ్వంసం చేసి ఆ ప్లాన్‌ను తిప్పికొట్టామన్నారు. కాగా అంతకుముందు ఇరాన్‌పై దాడులు మరో రెండు వారాలు కొనసాగించాలని అనుకుంటున్నట్లు ఇజ్రాయెల్, US అధికారులు తెలిపారు.
News March 11, 2026
BREAKING: IPL తొలి దశ షెడ్యూల్ వచ్చేసింది

ఐపీఎల్-2026 తొలి దశ షెడ్యూల్ విడుదలైంది. మార్చి 28 నుంచి ఏప్రిల్ 12 వరకు జరిగే 20 మ్యాచుల తేదీలు, వేదికలను ఐపీఎల్ ప్రకటించింది. షెడ్యూల్ కోసం పైన ఇమేజ్‌లు చూడండి. తొలి దశలో ప్రతి జట్టు 4 మ్యాచులు ఆడనుంది. మూడు రాష్ట్రాల ఎన్నికల డేట్లు ప్రకటించిన తర్వాత ఐపీఎల్ పూర్తి షెడ్యూల్‌ను వెలువరిస్తామని BCCI తెలిపింది.
News March 11, 2026
BREAKING: IPL తొలి మ్యాచ్ ఎవరి మధ్య అంటే?

క్రికెట్ అభిమానులకు శుభవార్త. IPL-2026 తొలి మ్యాచ్ వివరాలు వెల్లడయ్యాయి. ఈ నెల 28న తొలి మ్యాచ్ జరగనుంది. బెంగళూరులో రా.7.30 గంటలకు జరిగే ఈ పోరులో రాయల్ ఛాలెంజర్స్, సన్ రైజర్స్ తలపడనున్నట్లు IPL ట్వీట్ చేసింది. మరికాసేపట్లో తొలి దశ షెడ్యూల్ రానుంది.


