News September 19, 2025

మొక్కజొన్నలో పాము పొడ తెగులు నివారణ ఎలా?

image

మొక్కజొన్నలో పాముపొడ తెగులు నివారణకు నేలకు దగ్గరగా ఉన్న తెగులు సోకిన ఆకులను తొలగించి నాశనం చేయాలి. తర్వాత 200 గ్రా. కార్బెండజిమ్ (లేదా) 200 మి.లీ. ప్రోపికొనజోల్ మందును 200 లీటర్ల నీటికి కలిపి పంటపై పిచికారీ చేయాలి. ఏటా ఈ తెగులు ఆశించే ప్రాంతాల్లో పంట విత్తిన 40 రోజుల తర్వాత తెగులు సోకకముందే ఈ మందులను పిచికారీ చేసుకోవాలని.. పంట చుట్టూ కలుపు మొక్కలను తొలగించాలని నిపుణులు సూచిస్తున్నారు.

Similar News

News January 22, 2026

రొయ్యల్లో ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయొద్దు

image

రొయ్యల్లో వ్యాధులు వేగంగా వ్యాపిస్తాయి. అందుకే చెరువులోని రొయ్యల్లో కనిపించే కొన్ని లక్షణాలను రైతులు నిర్లక్ష్యం చేయకూడదంటున్నారు ఆక్వా నిపుణులు. రొయ్యలు ఆహారం తీసుకోవడం ఆకస్మికంగా తగ్గించినా, బలహీనంగా కనిపిస్తూ నీటి ఉపరితలంపై ఎక్కువ సమయం ఈదుతున్నా, రొయ్య ఎర్రగా కనిపిస్తూ, గుల్ల వదులుగా ఉన్నా, అకస్మాత్తుగా ఎక్కువ రొయ్యల మరణాలు కనిపిస్తే ఆక్వా రైతులు వెంటనే అప్రమత్తమై నిపుణుల సూచనలు తీసుకోవాలి.

News January 22, 2026

APPLY NOW: NCPORలో ఉద్యోగాలు..

image

గోవాలోని నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషన్ రీసెర్చ్(NCPOR) 6 ప్రాజెక్ట్ సైంటిస్ట్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత గల అభ్యర్థులు ఫిబ్రవరి 2న ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. పోస్టును బట్టి PG( ఫిజిక్స్, అప్లైడ్ ఫిజిక్స్, ఎర్త్ సైన్స్, జియోలజీ, CS, CS &Engg.), BE, BTech, ME, MTech ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. నెలకు రూ.56వేలు+HRA చెల్లిస్తారు. వెబ్‌సైట్: www.ncpor.res.in

News January 22, 2026

కాకిని హంసగా మార్చిన పుణ్య క్షేత్రం

image

కృష్ణా సాగర సంగమ తీరాన వెలసిన హంసలదీవి వేణుగోపాలస్వామి ఆలయం ఎంతో ప్రత్యేకమైనది. పూర్వం దేవతలు ఏకాంతంగా పూజలు చేయడానికి ఈ ఆలయాన్ని ఒక్క రాత్రిలో కట్టారని చరిత్ర. అయితే తెల్లారేసరికి రాజగోపురం అసంపూర్తిగా మిగిలిపోయిందట. అయితే గంగానది కాకి రూపంలో ఇక్కడ స్నానమాచరించి హంసలా స్వచ్ఛంగా మారినందుకు ‘హంసలదీవి’ అనే పేరొచ్చింది. నీలమేఘ ఛాయతో అలరారే స్వామివారి ఆలయంలో మాఘ మాస బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.