News April 2, 2025

శుభకార్యాల వేళ హిజ్రాల దోపిడీని అరికట్టేదెలా?

image

హైదరాబాద్‌లో హిజ్రాల దోపిడీ పెరిగిపోయింది. ఫంక్షన్ ఏదైనా ఇంట్లోకి వచ్చేసి డబ్బులు డిమాండ్ చేస్తూ బంధువుల ముందు పరువు తీస్తున్నారని నగరవాసులు SMలో వాపోతున్నారు. తాజాగా కూకట్‌పల్లిలో ఓ ఇంట్లో పూజ జరుగుతుండగా అక్కడికి వచ్చి రూ.8వేలు వసూలు చేశారు. ఆ తర్వాత ఇంటి గుమ్మానికి తమ సంతకం చేసి వెళ్లిపోయారు. ఇలాంటి ఘటనలపై పోలీసులకు ఫిర్యాదులందినా, చర్యలు లేవని నెట్టింట విమర్శలొస్తున్నాయి.

Similar News

News December 23, 2025

ఇతిహాసాలు క్విజ్ – 105 సమాధానం

image

ప్రశ్న: చిత్రంలో కనిపిస్తున్న వింత ఆకారానికి కొన్ని పురాణాల ప్రకారం ఓ పేరుంది. ఆ పేరేంటి? ఇది ఎవరి అవతారం?
సమాధానం: ఇది ‘నవగుంజర’. సాక్షాత్తూ శ్రీకృష్ణ పరమాత్ముడి అవతారం. ఒడియా కవి సరళ దాసు రాసిన మహాభారతం ప్రకారం.. అర్జునుడికి శ్రీకృష్ణుడు ఈ రూపంలో దర్శనమిచ్చాడు. తొమ్మిది రకాల జీవుల అవయవాలతో కూడిన ఈ విలక్షణ రూపం, భగవంతుడు సమస్త జీవరాశిలోనూ కొలువై ఉంటాడని చాటి చెబుతుంది.
<<-se>>#Ithihasaluquiz<<>>

News December 23, 2025

‘నీళ్లను ఒక్కసారిగా వదులుతోంది’.. భారత్‌పై పాక్ ఆరోపణలు!

image

భారత్ కావాలనే నదీ జలాలను అడ్డుకుంటూ ఇబ్బందులకు గురిచేస్తోందని పాక్ ఆరోపిస్తోంది. చీనాబ్ తర్వాత ఇప్పుడు జీలం, నీలం నదుల ప్రవాహం కూడా తగ్గిపోయిందని అంటోంది. భారత్ అర్ధాంతరంగా నీళ్లు ఆపుతూ ఒక్కసారిగా వదిలేస్తోందని పేర్కొంది. నీటి ప్రవాహం పడిపోవడం తమ వ్యవసాయ రంగాన్ని దెబ్బతీస్తోందని వాదిస్తోంది. దీనిపై మన ప్రభుత్వం ఇంకా స్పందించలేదు. పహల్గాం దాడి తర్వాత ‘సింధు జలాల’ ఒప్పందాన్ని భారత్ రద్దు చేసుకుంది.

News December 23, 2025

తల్లి అయిన తర్వాత నా బాడీపై గౌరవం పెరిగింది: కియారా

image

హీరోయిన్ కియారా అద్వానీ రీసెంట్‌గా తన బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ గురించి మనసు విప్పారు. 2025 జులైలో పాప పుట్టిన తర్వాత, తన శరీరాన్ని చూసే కోణం మారిందని చెప్పారు. ‘వార్ 2’ సినిమాలో బికినీ సీన్ కోసం చాలా కష్టపడ్డానని, అప్పట్లో పర్ఫెక్ట్ ఫిగర్ కోసం తాపత్రయపడ్డానని గుర్తు చేసుకున్నారు. కానీ ఒక ప్రాణానికి జన్మనిచ్చిన తన శరీరం పట్ల చాలా గౌరవం పెరిగిందని, సైజ్ ముఖ్యం కాదని గుర్తించానని తెలిపారు.