News May 8, 2024
రాజకీయ పార్టీ ఎలా నమోదు చేయాలి..?(1/2)

రాజకీయ పార్టీ పెట్టదలచుకునేవారు తమ దరఖాస్తును ఢిల్లీలోని ఈసీ కార్యాలయానికి సంబంధిత ఫార్మాట్‌లో సమర్పించాలి. పార్టీ అధికారిక లెటర్ హెడ్‌పై దరఖాస్తును టైప్ చేయాలి. ఏర్పాటైన నెల రోజుల్లో ఈసీకి పోస్టు ద్వారా లేదా సరాసరి దరఖాస్తును పంపించాలి. ఈసీ అండర్ సెక్రటరీ పేరిట రూ.10వేలకు డీడీ, సెక్షన్ 29ఏలోని సబ్-సెక్షన్(5)లో ఉన్న నిబంధనల్ని, రాజ్యాంగానికి తమ నిబద్ధతను పేర్కొంటూ టైప్ చేసిన ప్రతిని జత చేయాలి.
Similar News
News February 4, 2026
కుటుంబ సర్వే వేగవంతం కావాలి: అనకాపల్లి కలెక్టర్

జిల్లాలో నిర్వహిస్తున్న కుటుంబ సర్వేను వేగవంతం చేసి రెండు రోజుల్లో పూర్తి చేయాలని కలెక్టర్ విజయ కృష్ణన్ అధికారులను ఆదేశించారు. బుధవారం అనకాపల్లి కలెక్టరేట్ నుంచి MPDOలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అక్షరాంధ్ర లక్ష్యాలను సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లాలో 89,944 మంది నిరక్షరాస్యులను గుర్తించామన్నారు. వీరందరిని అక్షరాస్యులుగా తీర్చిదిద్ది మార్చిలో జరిగే పరీక్షకు సిద్ధం చేయాలన్నారు.
News February 4, 2026
అభివృద్ధిని చూసి ఎన్నికల్లో తీర్పు ఇవ్వాలి: CM

TG: ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఎదురేలేదని, తమ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని సీఎం రేవంత్ ధీమా వ్యక్తం చేశారు. అభివృద్ధిని చూసి ఓటేయాలని నల్గొండ జిల్లా గూడూరులో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో పిలుపునిచ్చారు. ‘3.17 కోట్ల మందికి సన్నబియ్యం ఇస్తున్నాం. సన్నబియ్యం వచ్చిన వారు కాంగ్రెస్‌కు ఓటేయాలి. RTCలో ఫ్రీగా ప్రయాణం చేస్తున్న వాళ్లంతా మాకు ఓటేస్తే BJP, BRSకు డిపాజిట్లు కూడా రావు’ అని పేర్కొన్నారు.
News February 4, 2026
ఎవరు.. ఏ కులం: స్టూడెంట్ల క్యాస్ట్ డేటాపై కసరత్తు

TG: రాష్ట్రంలోని విద్యా సంస్థల్లో బీసీ విద్యార్థుల సమాచారాన్నిBC కమిషన్ కులాల వారీగా సేకరిస్తోంది. ఈ సమాచారం ఆధారంగా బీసీ విద్యార్థుల్లో ఏ కులం వారు ఎంత మంది ఉన్నారో లెక్కించనుంది. విద్యకు బాగా దూరంగా ఉన్న బీసీ కులాలను గుర్తించి ప్రోత్సహించనుంది. దీనిలో భాగంగా SE డైరెక్టర్ నవీన్ నికోలస్, TGSCHE సెక్రటరీ శ్రీరామ్ వెంకటేశ్‌తో కమిషన్ ఇవాళ భేటీ అయింది. మొత్తం స్టూడెంట్ల డేటా వెంటనే ఇవ్వాలంది.


