News May 8, 2024

రాజకీయ పార్టీ ఎలా నమోదు చేయాలి..?(2/2)

image

పార్టీ అధ్యక్షుడు సంతకం చేసిన పార్టీ రాజ్యాంగం ప్రతి, 100మంది పార్టీ సభ్యులకు సంబంధించిన తాజా ఎలక్టోరల్ రోల్స్, ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఎదుట పార్టీ అధ్యక్షుడు లేదా ప్రధాన కార్యదర్శి ప్రమాణ స్వీకారం చేసినట్లు సంతకం చేసిన అఫిడవిట్, తాము వేరే పార్టీ సభ్యులం కాదని పేర్కొంటూ ప్రమాణం, సంతకాలు చేసిన 100మంది పార్టీ సభ్యుల అఫిడవిట్లు, పార్టీ బ్యాంకు ఖాతాలను కూడా దరఖాస్తుతో జత చేసి ఇవ్వాల్సి ఉంటుంది.

Similar News

News February 5, 2026

25,000 మంది ఫ్రెషర్లను తీసుకుంటాం: కాగ్నిజెంట్

image

IT సంస్థ కాగ్నిజెంట్ ఈ ఏడాది దాదాపు 25K మంది ఫ్రెషర్లను రిక్రూట్ చేసుకోనున్నట్లు వెల్లడించింది. 2025లో 20K మంది గ్రాడ్యుయేట్లను నియమించుకున్నామని, ఈ సంఖ్యను 20 శాతం మేర పెంచుతామని సంస్థ CEO రవికుమార్ తెలిపారు. AI ద్వారా ఎంట్రీ లెవెల్‌ ఉద్యోగులకు అత్యున్నత సాంకేతిక నైపుణ్యాన్ని అందిస్తామన్నారు. IITలలో క్యాంపస్ ఇంటర్వ్యూలు, ఇతర మార్గాల ద్వారా ప్రోగ్రామర్లు, ఇంజినీర్లను తీసుకుంటామని పేర్కొన్నారు.

News February 5, 2026

ఫైబ్రోసిస్టిక్ బ్రెస్ట్ ఛేంజెస్ లక్షణాలు

image

ఫైబ్రోసిస్టిక్ బ్రెస్ట్ ఛేంజెస్ సమస్య ఉన్న మహిళల్లో రొమ్ము వాపులు, నొప్పి, రొమ్ముల్లో కణితులు, రొమ్ముల దగ్గర చర్మం రంగు మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. మరికొందరు మహిళల్లో అయితే రొమ్ముల నుంచి ఆకుపచ్చ లేదా గోధుమ రంగు రక్తస్రావం కూడా జరుగుతుంది. ఇలా ఎక్కువగా జరుగుతున్నట్లయితే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ వ్యాధిని నిర్ధారించడానికి డిజిటల్ మమోగ్రఫీ, అల్ట్రాసౌండ్ వంటి పరీక్షలు చేస్తారు.

News February 5, 2026

ఫైబ్రోసిస్టిక్ బ్రెస్ట్ ఛేంజెస్ చికిత్స

image

డిజిటల్ మమోగ్రఫీ, అల్ట్రాసౌండ్ పరీక్ష ఫలితాలను బట్టి ఫైబ్రోసిస్టిక్ బ్రెస్ట్ ఛేంజెస్ చికిత్స ఉంటుంది. ఈ సమస్య ఎక్కువగా 20 నుంచి 50ఏళ్ల మధ్య వాళ్లకి వస్తుంది. పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఈ సమస్యను తగ్గించుకోవచ్చు. అలాగే తగినంత నిద్రతో పాటు పండ్ల రసాలు, సరిపడా నీళ్లు తాగాలి. కెఫిన్ ఉండే పదార్ధాలకు దూరంగా ఉండాలి. బ్రెస్ట్‌లో అసాధారణ మార్పులు గమనిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.