News May 4, 2024
ఫేక్ న్యూస్ని గుర్తించండి ఇలా!

Way2News పాపులారిటీని కొందరు దుర్వినియోగం చేస్తున్నారు. మా లోగోతో ఫేక్ వార్తలు వైరల్ చేస్తున్నారు. వాటిని విశ్వసిస్తే ఇబ్బంది పడే ప్రమాదముంది. Way2News లోగోతో మీరు పొందే ఫార్వర్డ్ స్క్రీన్షాట్లను సులువుగా వెరిఫై చేయొచ్చు. మా ప్రతి వార్తకు యునిక్ కోడ్ ఉంటుంది. fc.way2news.comలో ఆ కోడ్ ఇస్తే సేమ్ ఆర్టికల్ చూపాలి. లేదంటే ఆ స్క్రీన్షాట్ ఫేక్. అలాంటి వాటిని grievance@way2news.comకు మెయిల్ చేయండి.
Similar News
News January 23, 2026
IBPS RRB క్లర్క్ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల

IBPS ఆర్ఆర్బీ క్లర్క్ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదలయ్యాయి. అభ్యర్థులు రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ ఎంటర్ చేసి https://www.ibps.in/ వెబ్సైట్లో ఫలితాలు తెలుసుకోవచ్చు. 8,002 పోస్టుల భర్తీకి డిసెంబర్ 6,7,3,14 తేదీల్లో ప్రిలిమ్స్ నిర్వహించారు. ఫలితాల కోసం ఇక్కడ <
News January 23, 2026
బత్తాయి చెట్లు ఎండిపోతున్నాయా?

వేరుకుళ్లు తెగులు సోకినప్పుడు చెట్లు వడలి కాయలు రాలిపోతాయి. దీని నివారణకు 1% బోర్డో మిశ్రమం లేదా 0.2% కార్బండిజమ్(లీటరు నీటికి 2గ్రా. చొప్పున) మిశ్రమం 20 లీటర్లు పాదుల్లో పోయాలి. ఒక్కో చెట్టుకు 10KGల మేర వృద్ధి చేసిన ట్రైకోడెర్మా విరివిడిని చెట్ల పాదుల్లో కలియబెట్టాలి. ట్రైకోడెర్మా రెస్సీ 100గ్రా, సూడోమోనాస్ ఫ్లోరిసెన్స్ 100గ్రా, 2KGల వేప పిండి, 25KGల పశువుల ఎరువుతో కలిపి పాదుల్లో వేసుకోవాలి.
News January 23, 2026
కమ్యూనిస్ట్ గడ్డపై కమలం వికసించేనా?

సౌతిండియాలో పాగా వేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. ఇటీవల తిరువనంతపురం మేయర్ పీఠాన్ని దక్కించుకోవడంతో కమలం శ్రేణుల్లో కొత్త ఉత్సాహం వచ్చింది. ఇవాళ మోదీ పర్యటన కార్యకర్తల్లో మరింత జోష్ నింపింది. వికసిత్ కేరళం అంటూ ఆయన పిలుపునిచ్చారు. దీంతో త్వరలో అసెంబ్లీ ఎన్నికల్లో కమ్యూనిస్టుల పీఠాన్ని కదిలించి కమలం జెండా ఎగురవేస్తామని శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. మరి కేరళలో బీజేపీ అధికారం చేపడుతుందా?


