News September 7, 2025

వర్షాకాలంలో చర్మ సంరక్షణ ఇలా

image

* మేఘావృతమైన రోజుల్లోనూ సూర్యుని యూవీ కిరణాల ప్రభావం ఉంటుంది. అందుకే కనీస SPF 30 ఉన్న సన్‌స్క్రీన్‌ లోషన్‌ను ఉపయోగించాలి.
* వాతావరణం తేమగా ఉంటుంది కనుక చర్మరంధ్రాలు మూసుకోకుండా, హైడ్రేటెడ్‌గా ఉంచడానికి తేలికపాటి మాయిశ్చరైజర్‌ని వాడాలి.
* సున్నితమైన, నూనె లేని సువాసన లేని క్లెన్సర్‌ను ఎంచుకోండి.
* మొటిమలను నివారించడానికి ఎప్పటికప్పుడు చర్మాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి.

Similar News

News September 8, 2025

బీసీలే టార్గెట్‌గా కవిత, మల్లన్న పార్టీలు?

image

TG: రాష్ట్రంలో BC కాన్సెప్ట్‌తో 2 కొత్త పార్టీలు ఎంట్రీకి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఓవైపు తీన్మార్ మల్లన్న ఈ నెల 17న పార్టీ పేరు, జెండాను ఆవిష్కరిస్తారని ప్రచారం జరుగుతుండగా.. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలలోపు పార్టీని ప్రకటించి జెండా, ఎజెండా‌ను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కవిత యోచిస్తున్నట్లు సమాచారం. బీసీలను తమ వైపు తిప్పుకోవడానికి వీరిద్దరూ పోటాపోటీగా ప్రయత్నిస్తున్నట్లు చర్చ జరుగుతోంది.

News September 8, 2025

4 రోజుల్లో అకౌంట్లోకి డబ్బులు!

image

AP: ఉపాధి హామీ శ్రామికుల వేతన బకాయిలు చెల్లించేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.1,668కోట్లు విడుదల చేసింది. 4రోజుల్లోగా శ్రామికుల ఖాతాల్లో నగదు జమ కానుంది. ఈ నిధులతో మే 15 – ఆగస్టు 15 వరకు చెల్లించాల్సిన బకాయిలు తీరిపోతాయని ఉన్నతాధికారులు చెబుతున్నారు. మిగిలిన చెల్లింపుల కోసం దాదాపు రూ.140 కోట్లు అవసరం అవుతాయని తెలిపారు. బకాయిల చెల్లించాలని కేంద్రానికి రాష్ట్ర అధికారులు లేఖలు రాయగా నిధులు విడుదల చేసింది.

News September 8, 2025

చంద్రుడు ఎందుకు ఎరుపెక్కుతాడు?

image

సూర్యునికి చంద్రునికి మధ్యలో భూమి వచ్చినప్పుడు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. అర్ధరాత్రి చంద్రగ్రహణం <<17644262>>సందర్భంగా<<>> చంద్రుడు పూర్తిగా ఎరుపు రంగులోకి మారాడు. దీన్నే ‘బ్లడ్ మూన్’ అంటారు. భూమి అడ్డుకోగా మిగిలిన సూర్యకిరణాలు వాతావరణం గుండా ప్రసరించి చంద్రుడిని చేరుతాయి. సప్తవర్ణాల్లోని నీలిరంగు తేలిపోగా ఎరుపు, నారింజ రంగు కిరణాలు మాత్రమే చందమామపై పడతాయి. దీంతో చంద్రుడు ఎరుపెక్కుతాడు.