News October 8, 2025

చియా సీడ్స్ ఎలా తీసుకోవాలంటే?

image

చియా సీడ్స్ చూడడానికి చిన్నగా ఉన్నా, పోషకాలు మాత్రం చాలా ఎక్కువ. వీటిని నీటిలో లేదా పాలల్లో కొన్నిగంటలు నానబెట్టి స్మూతీస్, చియా పుడ్డింగ్‌లో కలుపుకోవచ్చు. సలాడ్స్, సూప్స్‌పై చల్లుకొని తీసుకోవచ్చు. బేక్ చేసిన పదార్థాలలో కూడా వీటిని కలపొచ్చు. షుగర్, బీపీ సమస్యలు ఉన్నవారు, లేదా ఏవైనా మందులు వాడుతున్నవారు చియా సీడ్స్‌ను తమ ఆహారంలో చేర్చుకునే ముందు తప్పనిసరిగా వైద్యులను సంప్రదించాలి.

Similar News

News March 5, 2026

కొచ్చిన్ పోర్ట్ అథారిటీలో ఉద్యోగాలు.. దరఖాస్తు చేశారా?

image

కొచ్చిన్ పోర్ట్ అథారిటీలో 5 పోస్టులకు అప్లై చేయడానికి మార్చి 10 ఆఖరు తేదీ. ఉద్యోగాన్ని బట్టి BTech/BE (సివిల్ ఇంజినీరింగ్) అర్హతతో పాటు పని అనుభవం గలవారు అప్లై చేసుకోవచ్చు. సీనియర్ ప్రాజెక్ట్ కన్సల్టెంట్‌కు నెలకు రూ.65వేలు, ప్రాజెక్ట్ కన్సల్టెంట్‌కు రూ.55వేలు చెల్లిస్తారు. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ, DV ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.cochinport.gov.in

News March 5, 2026

ఉగాదికి ‘ఉస్తాద్ భగత్‌ సింగ్’

image

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీశ్ శంకర్ తెరకెక్కించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది. ముందుగా ప్రకటించినట్లు ఈనెల 26న కాకుండా ఉగాది సందర్భంగా ఈనెల 19న రిలీజ్ చేస్తామని మేకర్స్ వెల్లడించారు. ‘ఈ ఉగాదికి ఉస్తాద్ ఊచకోత’ అంటూ స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ మూవీలో శ్రీలీల, రాశీఖన్నా హీరోయిన్లుగా నటించగా దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు.

News March 5, 2026

బిహార్ సీఎం రేసులో ఆ ఇద్దరు!

image

నితీశ్ కుమార్ రాజ్యసభకు వెళ్లనుండటంతో బిహార్‌లో సీఎం పోస్ట్ ఖాళీ కానుంది. దీంతో ప్రస్తుత డిప్యూటీ సీఎం, బీజేపీ నేత సామ్రాట్ చౌదరి, కేంద్ర సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ సీఎం రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. వీరిద్దరూ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులుగా చేసి పార్టీ బలోపేతంలో కీలకపాత్ర పోషించారు. దీంతో సీఎం పదవి ఎవరికి ఇవ్వాలనే దానిపై బీజేపీ జాతీయాధ్యక్షుడు నితిన్ కసరత్తు చేస్తున్నారు.