News April 29, 2024

వాట్సాప్ అకౌంట్ అన్‌బ్లాక్ చేసుకోండిలా..

image

ఇటీవల వాట్సాప్ అకౌంట్స్ బ్లాక్ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ మీ అకౌంట్ బ్లాక్ అయితే.. ఇలా చేయండి. > యాప్ రీఇన్‌‌స్టాల్ చేయాలి. సెటప్ ప్రాసెస్ సమయంలో Nextకి బదులుగా Supportని ఎంచుకోవాలి. ఆ తర్వాత Request an Account Review ఆప్షన్ వస్తుంది. అక్కడ మీ అకౌంట్ బ్లాక్ అయిన వివరాలు నమోదు చేయండి. మీ అకౌంట్ రికవరీ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే పదేపదే బ్లాక్ అయితే ఈ వెసులుబాటు ఉండకపోవచ్చు.

Similar News

News December 6, 2025

కూరగాయ పంటల్లో వైరస్ తెగుళ్ల లక్షణాలు (2/2)

image

వైరస్ ఆశించిన కొన్ని కూరగాయల మొక్కల ఆకులు ముడతలు పడి, ముడుచుకొని, నిక్కబొడుచుకొని కనిపిస్తాయి. ఆకులు చిన్నగా ఉండి ఆకుపచ్చ రంగు కోల్పోవడం వల్ల మొక్కల్లో ఆహారోత్పత్తి తగ్గి వాడిపోయినట్లుగా ఉంటాయి. వైరస్ ఆశించిన మొక్కల్లో లేత ఆకులు చిన్నగా మారి, పైకి కిందికి ముడుచుకొని వికారంగా మారతాయి. మొక్కల్లో పెరుగుదల లోపించి, కణుపుల మధ్యదూరం తగ్గి గిడసబారి పూత రావడం, కాయకట్టడం తగ్గుతుంది.

News December 6, 2025

స్ఫూర్తిని రగిలించే డా.అంబేడ్కర్ మాటలు

image

➛ ఎంత ఎక్కువ కాలం బతికామన్నది కాదు. ఎంత గొప్పగా జీవించామన్నదే ముఖ్యం
➛ మేకల్ని బలి ఇస్తారు. పులుల్ని కాదు. పులుల్లా బతకండి
➛ మాట్లాడాల్సిన చోట మౌనంగా ఉండటం, మౌనంగా ఉండాల్సిన చోట మాట్లాడటం రెండూ తప్పే
➛ ప్రజలకు ఓటు హక్కే ఆయుధం. పోరాడి రాజులవుతారో అమ్ముకుని బానిసలవుతారో వారి చేతుల్లోనే ఉంది
➛ విశ్వాసం కలిగి ఉండండి. ఆశను కోల్పోకండి
* ఇవాళ అంబేడ్కర్ వర్ధంతి *

News December 6, 2025

చిన్న చీమ పెద్ద మనసు.. చావడానికీ వెనుకాడదు!

image

కష్టం, క్రమశిక్షణకు మారుపేరైన చీమల గురించి ఓ ఆసక్తికర విషయం వెల్లడైంది. తీవ్రంగా జబ్బుపడిన చీమలు తమ జాతిని కాపాడుకోవడానికి ప్రాణత్యాగానికి సిద్ధమవుతాయని ఆస్ట్రియా పరిశోధకుల స్టడీలో తేలింది. అనారోగ్యానికి గురైనవి రసాయన వాయువు రిలీజ్ చేసి ‘డేంజర్’, ‘నన్ను చంపండి’ అనే సిగ్నల్‌ ఇస్తాయని సైంటిస్టులు చెప్పారు. దీంతో ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందకుండా ఆ చీమ గూడును ఇతర చీమలు చీల్చివేస్తాయని తెలిపారు.