News January 28, 2025

కాళేశ్వరం వద్ద త్రివేణి సంగమం ఎలా ఏర్పడింది?

image

TG: కాళేశ్వర క్షేత్రం వద్ద గోదావరి, ప్రాణహిత నదులతో పాటు <<15282909>>సరస్వతి నది<<>> కలుస్తుందని భక్తులు నమ్ముతారు. రెండు నదులు ఎక్కడ కలిసినా అక్కడ సరస్వతి నది అంతర్వాహినిగా ప్రవహిస్తుందని పురాణాలు చెబుతున్నాయని పండితులు పేర్కొన్నారు. ప్రయాగ్‌రాజ్‌లోని సరస్వతి నదిని, ఇక్కడి సరస్వతి నదిని ఒకటిగానే భావిస్తుంటారని తెలిపారు. ఇక్కడ సరస్వతి ఆలయం ఉండటం వల్ల కూడా సరస్వతి నది ఉన్నట్టుగా భావిస్తారని చెప్పారు.

Similar News

News October 30, 2025

చూడి పశువుల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

image

మిగిలిన పశువుల కంటే చూడి పశువుల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. వీటిని బయటకు వదలకుండా కొట్టం దగ్గరే పరిమితమైన వ్యాయామం కల్పించాలి. శుభ్రమైన మేత, తాగునీరు అందించాలి. కొట్టంలో జారుడునేల లేకుండా చూడాలి. ఇతర పశువులతో పోట్లాడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కుక్కలు వీటి వెంటపడి పరిగెత్తించకుండా చూడాలి. కాలువలలో దించడం, వాలుగా ఉన్న ఎత్తయిన గట్లు ఎక్కించడం, ఎక్కువ దూరం నడిపించడం చేయకూడదు.

News October 30, 2025

పెరిగిన బంగారం ధరలు

image

కొంతకాలంగా రోజులో రెండుసార్లు బంగారం ధరల్లో మార్పులొస్తున్నాయి. HYD బులియన్ మార్కెట్‌లో ఇవాళ <<18146766>>ఉదయం<<>> 24 క్యారెట్ల 10గ్రా.ల బంగారం ధర రూ.1,910 తగ్గగా ఇప్పుడు రూ.990 పెరిగి రూ.1,21,480కు చేరింది. 22 క్యారెట్ల 10గ్రా.ల గోల్డ్ రేట్ ఉదయంతో పోల్చితే రూ.900 ఎగబాకి రూ.1,11,350 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.1,65,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

News October 30, 2025

రేపు అజహరుద్దీన్ ప్రమాణ స్వీకారం!

image

TG: కాంగ్రెస్ నేత అజహరుద్దీన్ రేపు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం 12.15గంటలకు రాజ్ భవన్‌లో జరిగే కార్యక్రమంలో ఆయనతో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రమాణం చేయించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇందుకు సంబంధించి ఇప్పటికే మంత్రులకు ఆహ్వాన లేఖలు అందినట్లు సమాచారం.