News January 24, 2025
VSR ప్రకటనపై జగన్ ఎలా స్పందిస్తారో?

వైసీపీ చీఫ్ జగన్ విదేశాల్లో పర్యటిస్తున్న సమయంలో <<15247358>>VSR ట్వీట్<<>> సంచలనంగా మారింది. ముందు నుండి వైసీపీలో కీలక నేతగా జగన్కు వెన్నుదన్నుగా విజయసాయి ఉన్నారు. టీటీడీ బోర్డు మెంబర్ అయ్యాక ప్రజల్లోకి వచ్చిన ఆయన రెండు సార్లు రాజ్యసభ మెంబర్గా చేశారు. రాజకీయంగా టీడీపీ, కూటమి ప్రభుత్వాన్ని వ్యతిరేకించిన ఆయన ఊహించని విధంగా ప్రకటన చేయడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై జగన్ ఏవిధంగా స్పందిస్తారని ఆసక్తి నెలకొంది.
Similar News
News November 24, 2025
రబీ రాగుల సాగు- మధ్యకాలిక, స్వల్ప కాలిక రకాలు

☛ సప్తగిరి: ఇది మధ్యకాలిక రకం. పంట కాలం 100-105 రోజులు. ముద్దకంకి కలిగి, అగ్గి తెగులును తట్టుకొని 12-15 క్వింటాళ్ల దిగుబడినిస్తుంది. ☛ వకుళ: పంట కాలం 105-110 రోజులు. దిగుబడి- ఎకరాకు 13-15 క్వింటాళ్లు. ☛ హిమ- తెల్ల గింజ రాగి రకం. పంటకాలం 105-110 రోజులు. దిగుబడి: 10-12 క్వింటాళ్లు. ☛ మారుతి: స్వల్పకాలిక రకం. పంట కాలం 85-90 రోజులు. ఎకరాకు 10-12 క్వింటాళ్ల దిగుబడిస్తుంది. అంతర పంటగా వేసుకోవచ్చు.
News November 24, 2025
అనంతమైన పుణ్యాన్ని ఇచ్చే విష్ణు నామం

ఋషిర్నామ్నాం సహస్రస్య వేదవ్యాసో మహామునిః|
ఛన్దో నుష్టుప్ తథా దేవో భగవాన్ దేవకీసుతః||
విష్ణు సహస్ర నామాలకు రుషి ‘వేదవ్యాసుడు’. ఈ స్తోత్రం ఛందస్సు ‘అనుష్టుప్’. ఈ పారాయణంలో దేవకీ పుత్రుడైన కృష్ణుడిని ఆరాధిస్తాం. అయితే శ్లోకాలను పఠించే ముందు భక్తులు వివరాలు తెలుసుకోవాలి. విష్ణు నామాల మూలం, ఛందస్సు, ఆరాధ దైవం గురించి తెలుసుకొని మరింత సంకల్పంతో పఠిస్తే అనంతమైన పుణ్యం లభిస్తుంది. <<-se>>#VISHNUSAHASRANAMAM<<>>
News November 24, 2025
క్రీడాకారులకు ఆర్మీలో ఉద్యోగాలు

<


