News January 9, 2025

ఇలా అయితే పెళ్లిళ్లు ఎలా అవుతాయ్..!

image

ఒకప్పుడు అమ్మాయిని బాగా చూసుకోగలడా, బాధ్యతాయుతంగా ఉంటాడా అని చూసి ఆడపిల్లల తల్లిదండ్రులు పెళ్లి చేసేవారు. కానీ ఇప్పుడు అబ్బాయికి రూ.లక్షకు పైగా జీతం, కారు, బంగ్లా ఉంటేనే పెళ్లికి ఓకే చెబుతున్నారు. ఇది అందరికీ సాధ్యం కాకపోవడంతో పెళ్లి అనే పదం భారమవుతోంది. పెద్దలు ఆలోచన తీరు మార్చుకోవాలని యువకులు కోరుతున్నారు. వివాహ వ్యవస్థను వ్యాపారమయంగా మారుస్తున్నారని, బాంధవ్యాలకు విలువ ఇవ్వాలని సూచిస్తున్నారు.

Similar News

News November 19, 2025

VKB: మత్తు పదార్థాల నిర్మూలనకు కృషి చేయాలి: కలెక్టర్

image

మత్తు పదార్థాల నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో డ్రగ్స్ నిర్మూలన వ్యతిరేక దినోత్సవం నిర్వహించారు. కలెక్టర్, ఎస్పీ నారాయణరెడ్డి పాల్గొని మాట్లాడుతూ.. డ్రగ్స్ రైతు సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తోడ్పాటు అందించాలన్నారు.

News November 19, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News November 19, 2025

ఇండియా ఘన విజయం

image

ACC మెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీలో ఇండియా-ఏ జట్టు రెండో విజయం సాధించింది. ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఒమన్ 20 ఓవర్లలో 135-7 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని 17.5 ఓవర్లలోనే భారత్ ఛేదించింది. ఓపెనర్లు వైభవ్(12), ప్రియాన్ష్ ఆర్య(10) నిరాశపరిచినా, హర్ష్ దూబే(53*), నమన్ ధిర్(30) రాణించారు. దీంతో ఇండియా-ఏ సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది.