News October 2, 2024
సురేఖ కామెంట్స్‌పై రేవంత్ ఎలా స్పందిస్తారో?

TG: చైతూ-సామ్ విడాకులు, KTR, నాగార్జునపై మంత్రి కొండా సురేఖ <<14254371>>కామెంట్స్<<>> రచ్చకు దారితీశాయి. వీటిపై నాగార్జున ఫ్యామిలీతో పాటు సమంత తీవ్రంగా స్పందించారు. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలని సురేఖకు KTR లీగల్ నోటీసులు పంపారు. అయితే మంత్రి కామెంట్స్‌పై CM రేవంత్ రెడ్డి మాత్రం ఇంకా స్పందించలేదు. ఆయన ఎలా రియాక్ట్ అవుతారన్నది ఆసక్తిగా మారింది. సురేఖను మందలించి, ఏమైనా చర్యలు తీసుకుంటారా? లేదా? అన్నది చూడాలి.
Similar News
News March 16, 2026
నందిని సిధారెడ్డికి సాహిత్య అకాడమీ అవార్డు

TG: ప్రముఖ రచయిత నందిని సిధారెడ్డి రచించిన ‘అనిమేష’ కవితా సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. 24 భారతీయ భాషలలో ఈ సాహిత్య అవార్డులను అకాడమీ ప్రకటించింది. ‘అనిమేష’తో పాటు ఆయా భాషల్లోని రచయితల సాహిత్య పుస్తకాలకు అవార్డులను ప్రకటించింది. కొవిడ్ సమయంలో ప్రజలు ఎదుర్కొన్న వేదన, భయం, సంఘర్షణలను ప్రతిబింబించే కావ్యమిది. అప్పటి పరిస్థితులను అక్షరరూపంలో కళ్లకు కట్టేలా రచయిత ఆవిష్కరించారు.
News March 16, 2026
20న రాష్ట్ర బడ్జెట్.. 30 వరకు సమావేశాలు

TG: ఇవాళ ప్రారంభమైన రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ఈ నెల 30వ తేదీ వరకు నిర్వహించాలని BAC భేటీలో నిర్ణయించారు. ఇక 20వ తేదీ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. మరోవైపు ఉగాది(19), రంజాన్(21), శ్రీరామనవమి(27) పర్వదినాల వేళ అసెంబ్లీకి సెలవు ఉండనుంది.
News March 16, 2026
రోహిత్ రెడ్డి ఆహ్వానంతోనే పార్టీకి వచ్చారు: FIR

TG: మొయినాబాద్ <<19386155>>కేసులో<<>> మాజీ MLA పైలట్ రోహిత్ రెడ్డి అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. కాగా ఆయన ఆహ్వానంతోనే నిందితులు పార్టీకి వచ్చినట్లు FIRలో వెల్లడైంది. 11 మందిని పరీక్షించగా ఆరుగురికి పాజిటివ్ వచ్చిందని, సిమ్లాలో కొకైన్ కొన్నట్టు నిందితుడు కౌశిక్ అంగీకరించినట్లు పేర్కొంది. పోలీసులమని చెప్పినా షూట్ చేశారని.. రోహిత్ రెడ్డి సోదరుడైన రితేశ్ రెడ్డి పేరున ఉన్న ఆ గన్‌ను సీజ్ చేసినట్లు పేర్కొంది.


