News May 11, 2024
యాపిల్ కొత్త యాడ్‌పై హృతిక్ రోషన్ ఆగ్రహం

యాపిల్ ‘ఐప్యాడ్-ప్రొ’ యాడ్‌పై ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మ్యూజిక్ పరికరాలు, బుక్స్, పెయింటింగ్స్, స్పీకర్స్, గేమింగ్ డివైజ్‌లను క్రాష్ చేస్తూ ఉన్న ఆ ప్రకటనపై మండిపడుతున్నారు. ఇప్పటికే సెలబ్రెటీలు హ్యూ గ్రాంట్, జస్టిన్ బాట్మాన్, ఆసిఫ్ కపాడియా, ల్యూక్ బార్నెట్ యాపిల్‌పై విమర్శలు చేయగా, తాజాగా హృతిక్ రోషన్ ఆ జాబితాలో చేరారు. యాపిల్ ప్రకటన విచారకరం, అజ్ఞానమని ఇన్‌స్టాలో పోస్టు చేశారు.
Similar News
News January 22, 2026
బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డును ICC సస్పెండ్ చేయనుందా?

T20 WC మ్యాచులు భారత్‌లో ఆడబోమని బంగ్లా క్రికెట్ బోర్డ్ చెప్పడాన్ని ICC సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇండియాలో ఆడాల్సిందే అని చెప్పినా వినకపోవడం వెనుక రాజకీయ దురుద్దేశం ఉన్నట్లు భావిస్తోంది. విచారణలో ఇదే నిజమని తేలితే BCBని సస్పెండ్ చేయాలని ఆలోచిస్తున్నట్లు క్రీడా వర్గాలు చెబుతున్నాయి. వచ్చే నెల 7న WC ప్రారంభం కానున్న నేపథ్యంలో త్వరలోనే డెసిషన్ తీసుకోనుందని అభిప్రాయపడుతున్నాయి.
News January 22, 2026
నెక్స్ట్ నోటీసులు ఇచ్చేది కేసీఆర్‌కేనా?

TG: ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. BRS కీలక నేతలకు సిట్ వరుసబెట్టి నోటీసులు ఇస్తోంది. ఈ నెల 20న హరీశ్ రావును విచారించిన అధికారులు తాజాగా KTRకూ నోటీసులిచ్చారు. రేపు విచారణకు రావాలని ఆదేశించారు. కాగా నెక్స్ట్ సిట్ నుంచి నోటీసులు వచ్చేది BRS అధినేత KCRకేనని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
News January 22, 2026
సౌతాఫ్రికా WC జట్టులో మార్పులు

T20 WC జట్టులో SA మార్పులు చేసింది. బ్యాటర్లు జోర్జి, ఫెరీరా గాయాల వల్ల జట్టుకు దూరమయ్యారని, వారి స్థానాల్లో స్టబ్స్, రికెల్టన్ను తీసుకున్నట్లు వెల్లడించింది. మరోవైపు మిల్లర్ కండరాల గాయంతో బాధపడుతున్నారని, ఫిట్నెస్ టెస్టులో పాసైతేనే ఆయన WCలో ఆడతారని తెలిపింది.
టీమ్: మార్క్రమ్(C), బాష్, బ్రెవిస్, డికాక్, జాన్సెన్, లిండే, కేశవ్, మఫాకా, మిల్లర్, ఎంగిడి, నోర్ట్జే, రబాడ, రికెల్టన్, స్మిత్, స్టబ్స్


