News October 4, 2025
విశాఖలో HSBC బ్యాంకు!

AP: అతిపెద్ద విదేశీ బ్యాంకు HSBC వైజాగ్‌లో తమ బ్రాంచ్ ఏర్పాటు చేయనుంది. విశాఖతో పాటు దేశంలోని 20 ప్రాంతాల్లో తమ శాఖలను విస్తరించేందుకు RBI అనుమతిచ్చిందని HSBC వెల్లడించింది. అనువైన ప్రాంతంలో భవనం దొరగ్గానే విశాఖలో బ్రాంచ్ ఏర్పాటు చేస్తామని ఆ బ్యాంక్ ఇండియా ఇంటర్నేషనల్ అండ్ ప్రీమియం బ్యాంకింగ్ విభాగం హెడ్ సందీప్ బాత్రా తెలిపారు. ఈ 20 శాఖలు ఏర్పాటైతే దేశంలో తమ బ్రాంచుల సంఖ్య 46కు చేరుతుందన్నారు.
Similar News
News October 4, 2025
వాస్తు శాస్త్రం అంటే ఏమిటి?

వాస్తు అంటే నిర్మాణాల శాస్త్రం. ఇది ఇళ్లు, ఇతర భవనాల్లో సానుకూల శక్తి, ప్రతికూల శక్తి మధ్య సమతుల్యతను సృష్టిస్తుందని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు తెలిపారు. ‘చుట్టూ ఉన్న శక్తులను మన అభివృద్ధికి అనుకూలంగా మార్చేలా నిర్మాణాలు ఎలా చేయాలో వాస్తు సూచిస్తుంది. వాస్తు ప్రకారం నిర్మించిన/సరిచేసిన ఇంట్లో నివసిస్తే మానసిక ప్రశాంతతతో, ఆనందంగా, కోరుకున్న విధంగా జీవిస్తారు’ అని పేర్కొన్నారు. <<-se>>#Vasthu<<>>
News October 4, 2025
శివుణ్ని, దక్షుడు ఎందుకు అవమానించాలని అనుకుంటాడు?

బ్రహ్మ కుమారుడే ‘దక్షుడు’. ఆయన ఓ గొప్ప ప్రజాపతి. సంప్రదాయాలు, నియమాలను గౌరవించే వ్యక్తి. ఆయన కూతురు సతీదేవి. ఆమెకు శివుడంటే అమితమైన ప్రేమ. అందుకే ఆయనను వివాహం చేసుకుంది. కానీ ఈ వివాహం ఆమె తండ్రి దక్షుడికి ఇష్టం ఉండదు. సంప్రదాయానికి పెద్ద పీట వేసే ఆయన శ్మశానాల్లో ఉంటూ.. భస్మం, పులి చర్మం ధరించే శివుణ్ని అల్లుడిగా అంగీకరించడు. అందుకే అవమానించాలని అనుకుంటాడు. <<-se>>#Shakthipeetam<<>>
News October 4, 2025
డబ్బులు పడకపోతే రిపోర్ట్ చేయండి: CBN

AP: ‘ఆటో డ్రైవర్ల సేవలో’ పథకం అమలుతో డ్రైవర్లు పండగ వాతావరణంలో ఉన్నారని సీఎం చంద్రబాబు అన్నారు. చెప్పిన సమయానికే అకౌంట్లలో డబ్బులు జమ చేశామని చెప్పారు. చరిత్రలో ఎరుగని విధంగా 2024లో 94% సీట్లు కట్టబెట్టారని, రాబోయే రోజుల్లో ఇంతకంటే ఎక్కువ ఇవ్వాలని సీఎం కోరారు. అర్హుల అకౌంట్లలో డబ్బులు పడకపోతే అధికారులకు రిపోర్ట్ చేయాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ డబ్బులు వేసే బాధ్యత తమదని స్పష్టం చేశారు.