News June 12, 2024

HSBD: వర్షాకాలంలో అప్రమత్తంగా ఉండాలి: మంత్రి పొన్నం

image

జీహెచ్ఎంసీ కార్యాలయంలో వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జీహెచ్ఎంసీ ఇన్‌ఛార్జి కమిషనర్ అమ్రపాలి అధ్యక్షతన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. వర్షాకాలంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఎమర్జెన్సీ బృందాలను అప్రమత్తంగా చేసి ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు.

Similar News

News December 4, 2025

కరీంనగర్‌: మూడు గ్రామాల్లో సర్పంచ్‌లు ఏకగ్రీవం

image

కరీంనగర్ జిల్లా మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో మూడుచోట్ల సర్పంచ్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చొప్పదండి మండలం దేశాయిపేటలో తిరుపతి, పెద్దకురుమపల్లిలో స్వరూప ఏకగ్రీవం కాగా, రామడుగు మండలం శ్రీరాములపల్లిలో సుగుణమ్మ సర్పంచ్‌గా ఖరారయ్యారు. దేశాయిపేటలో సర్పంచ్‌తో పాటు పాలకవర్గం మొత్తం ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారికంగా తెలిపారు.

News December 4, 2025

కరీంనగర్‌ జిల్లాలో 276 వార్డు సభ్యులు ఏకగ్రీవం

image

కరీంనగర్ జిల్లాలో మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో వార్డు సభ్యుల ఏకగ్రీవాల సంఖ్య పెరిగింది. చొప్పదండి, గంగాధర, రామడుగు, కొత్తపల్లి, కరీంనగర్ రూరల్ మండలాల్లోని మొత్తం 866 వార్డులకు గాను, 276 వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగిలిన 590 వార్డులకు ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నట్లు అధికారులు అధికారికంగా ప్రకటించారు.

News December 4, 2025

KNR: పంచాయతీ ఎన్నికల నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్

image

పంచాయతీ ఎన్నికల నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన ఎన్నికల సంఘం కమిషనర్ జిల్లాలలో పంచాయతీ ఎన్నికలను నిబంధన ప్రకారం నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఐ.రాణి కుముదిని అన్నారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఐ.రాణి కుముదిని కలెక్టర్లతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. తదితర అంశాల పట్ల ఎన్నికల కమిషనర్ రివ్యూ నిర్వహించారు.