News December 24, 2024

అమరావతికి రూ.11 వేల కోట్ల హడ్కో రుణం: నారాయణ

image

AP: రాజధాని అమరావతి నిర్మాణానికి హడ్కో రూ.11 వేల కోట్ల రుణం ఇచ్చేందుకు అంగీకారం తెలిపిందని మంత్రి నారాయణ తెలిపారు. ఇవాళ ఢిల్లీలో ఆయన పర్యటించారు. ‘అమరావతికి రుణం కోసం జిందాల్ ఛైర్మన్ పీఆర్ జిందాల్‌తో భేటీ అయ్యా. రాష్ట్రంలో వేస్ట్ టు ఎనర్జీ కేంద్రాల ఏర్పాటుపై ఆయనతో చర్చించా. ఇప్పటికే జిందాల్ సంస్థ గుంటూరు, వైజాగ్‌లో రెండు ప్లాంట్లు ఏర్పాటు చేసింది’ అని ఆయన పేర్కొన్నారు.

Similar News

News December 25, 2024

తీవ్ర అల్పపీడనం.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

image

AP: నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం ఇవాళ బలహీనపడుతుందని IMD వెల్లడించింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కూడా విస్తరించి ఉందని తెలిపింది. వీటి ప్రభావంతో ఇవాళ ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు, మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వానలు కురుస్తాయంది. కాగా బంగాళాఖాతంలో 2 రోజుల్లో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది.

News December 25, 2024

గాంధీ వందేళ్ల జ్ఞాపకం.. 2 రోజులు CWC సమావేశాలు

image

ఏఐసీసీ అధ్యక్షుడిగా మహాత్మా గాంధీ బాధ్యతలు స్వీకరించి వందేళ్లు పూర్తవుతున్న సందర్భంగా రేపు, ఎల్లుండి కాంగ్రెస్ ప్రత్యేక భేటీ నిర్వహించనుంది. కర్ణాటకలోని బెలగావిలో జరిగే ఈ సమావేశానికి ‘నవ సత్యాగ్రహ బైఠక్’గా పేరు పెట్టింది. 26వ తేదీన CWC సభ్యులు, పీసీసీలు, సీఎల్పీలు సహా 200 మంది కీలక నేతలు హాజరై పలు అంశాలపై చర్చిస్తారు. 27న నిర్వహించే సంవిధాన్ ర్యాలీలో లక్ష మంది కార్యకర్తలు పాల్గొంటారు.

News December 25, 2024

ఏపీ కొత్త సీఎస్‌గా సాయి ప్రసాద్?

image

AP: రాష్ట్ర CS నీరభ్ కుమార్ పదవీ కాలం ఈ నెలాఖరుతో ముగియనుంది. దీంతో కొత్త CS ఎవరనే ఉత్కంఠ నెలకొంది. సీనియార్టీ జాబితాలో IAS శ్రీలక్ష్మి టాప్‌లో ఉన్నారు. అయితే ఆమెను నియమించడానికి CM సిద్ధంగా లేరని తెలుస్తోంది. ఆమె తర్వాత అనంతరాము ఉన్నప్పటికీ సాయిప్రసాద్ వైపు మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. త్వరలోనే ఉత్తర్వులు వెలువడుతాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈయన గతంలో CBN పేషీలో కార్యదర్శిగా పనిచేశారు.