News July 24, 2024

ఏపీకి భారీ కేటాయింపులు.. కేంద్రానికి పవన్ థ్యాంక్స్

image

AP: రాష్ట్రానికి బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయించడంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు. విభజన హామీల అమలు, పోలవరం ప్రాజెక్టు పూర్తి కావడం అత్యవసరమన్న పవన్, కేంద్రం చొరవతో రాష్ట్ర అభివృద్ధికి ముందడుగు పడిందన్నారు. రాజధాని అవసరాన్ని గుర్తించి అమరావతికి ₹15వేల కోట్లు కేటాయించడం హర్షణీయం అని పేర్కొన్నారు. ఈ నిర్ణయాలు ఏపీ ప్రజల ఆత్మవిశ్వాసాన్ని పెంచే విధంగా ఉన్నాయన్నారు.

Similar News

News October 31, 2025

వృద్ధాప్యంలో ఒంటరితనం వేధిస్తోందా?

image

వృద్ధాప్యంలో ఒంటరితనం అతి పెద్ద సమస్య. పిల్లలు ఎక్కడో దూరంగా ఉండడం, ఏమైనా అయితే పిల్లలు రాగలరో లేరో అనీ కలవరపడతారని నిపుణులు చెబుతున్నారు. ఒంటరితనంతో గతం గురించి ఆలోచిస్తూ కుంగుబాటుకూ లోనవుతారు. రోజూ కాసేపు ధ్యానం చేయడం, స్నేహితులు, బంధువులతో సమయం గడపడం వంటివి మేలు చేస్తాయంటున్నారు. మనసును ఉల్లాసంగా ఉంచుకుంటే ఒంటరిననే భావన తగ్గుతుందని చెబుతున్నారు.

News October 31, 2025

యాచకురాలి దగ్గర నోట్ల కట్టలు!

image

కర్ణాటకలోని మంగళూరులో మానసిక అనారోగ్యంతో ఉన్న ఓ యాచకురాలు 13 ఏళ్లుగా చెత్త కుప్పల దగ్గర నివసిస్తోంది. ఆమెను సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు స్థానికులు ప్రయత్నించగా చెత్తలో ఉన్న సంచులను గట్టిగా పట్టుకుంది. అనుమానంతో వాటిని తెరిచి చూస్తే భారీగా నోట్లు, నాణేలు కనిపించాయి. వాటిని లెక్కిస్తే ₹లక్ష కంటే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో యాచకురాలిని అనాథ శరణాలయానికి తరలించారు.

News October 31, 2025

ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల

image

TG: ఇంటర్ బోర్డు పరీక్షల <>షెడ్యూల్ <<>>విడుదల చేసింది. రోజుకు 2 సెషన్స్(9AM-12PM, 2PM-5PM)చొప్పున FEB 2-21 వరకు ప్రాక్టికల్స్ ఉంటాయి. 21న ఫస్టియర్, 22న సెకండియర్‌కు ENG ప్రాక్టికల్స్ ఉంటాయి. FEB 25-MAR 18 వరకు రాత పరీక్షలు కొనసాగనున్నాయి. ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులకు రోజు మార్చి రోజు పరీక్షలుంటాయి. FEB 25న ఫస్టియర్, 26న సెకండియర్‌ ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి.