News March 21, 2025
జడ్జి ఇంట్లో భారీగా నోట్ల కట్టలు.. నెక్స్ట్ ఏంటి?

ఢిల్లీ హైకోర్టు జడ్జి యశ్వంత్ వర్మ ఇంట్లో అగ్ని ప్రమాదం జరగడంతో భారీగా నగదు బయటపడింది. ఇది లెక్కల్లో చూపని డబ్బు కావడంతో సుప్రీంకోర్టు కొలీజియం ఆగ్రహించింది. ఈ ఘటన న్యాయ వ్యవస్థను దెబ్బతీస్తుందని, వర్మ రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. ఆయనను ఢిల్లీ నుంచి అలహాబాద్‌కు బదిలీ చేయాలని నిర్ణయించింది. ఈ ఘటనపై వర్మ నుంచి CJI వివరణ కోరనున్నారు. ఆ వివరణతో సంతృప్తి చెందకపోతే అంతర్గత విచారణకు ఆదేశిస్తారు.
Similar News
News December 1, 2025
‘108’ సంఖ్య విశిష్టత

ధర్మశాస్త్రాల ప్రకారం.. మానవుడి శరీరంలో 108 ముఖ్యమైన నరాలు, మెదడులో 108 శక్తి కేంద్రాలు ఉన్నాయని చెబుతారు. వీటన్నింటినీ ఉత్తేజితం చేయడానికి ఓ మంత్రాన్ని కనీసం 108 సార్లు పఠించాలని సూచిస్తారు. ఇలా చేస్తే మంత్రంలోని శక్తి ఈ కేంద్రాలన్నింటికీ ప్రసరించి, సంపూర్ణ ఆధ్యాత్మిక ఫలం వస్తుందని నమ్మకం. పగడాల మాలతో జపం చేస్తే.. వేయింతల ఫలం, రత్నమాలతో చేస్తే పదివేల రెట్ల ఫలం వస్తుందని పురాణాలు వివరిస్తున్నాయి.
News December 1, 2025
SBIలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

SBIలో 15 పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. వీటిలో 5 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టులు, 10 మేనేజర్ పోస్టులు ఉన్నాయి. అర్హతగల అభ్యర్థులు ఈ పోస్టులకు వేర్వేరుగా అప్లై చేసుకోవాలి. ఉద్యోగాన్ని బట్టి డిగ్రీ , బీఈ, బీటెక్, MBA/MS/PGDBM/PGDBA ఫైనాన్స్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://sbi.bank.in
News December 1, 2025
పంచాయతీలో ‘నోటా’.. మెజార్టీ ఓట్లు వచ్చినా?

TG: పంచాయతీ ఎన్నికల్లో తొలిసారి నోటా(నన్ ఆఫ్ ది ఎబౌ)ను ప్రవేశపెట్టారు. అయితే నిబంధనల ప్రకారం అభ్యర్థుల కన్నా నోటాకు ఎక్కువ ఓట్లు వచ్చినా ఎలక్షన్‌ను ఎన్నికల సంఘం రద్దు చేయదు. తర్వాతి స్థానంలో ఎక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తుంది. నోటా అనేది కేవలం ఓటరుకు నిరసన తెలిపే హక్కుగానే పరిగణిస్తుంది. ఇప్పటికే పార్లమెంటు, ఎమ్మెల్యే ఎన్నికల్లో ఈ విధానం ఉంది.


