News June 27, 2024
ఐఎస్ఎస్‌ను డీకమిషన్ చేసేందుకు స్పేస్ఎక్స్‌కు భారీ కాంట్రాక్ట్

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని భూ కక్ష్యలోకి తీసుకొచ్చి ధ్వంసం చేసేందుకు నాసా స్పేస్ఎక్స్‌తో $843 మిలియన్లకు కాంట్రాక్ట్ కుదుర్చుకుంది. 2030లో ఈ డీకమిషనింగ్ ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ పని రష్యా చేయాల్సి ఉన్నా పలు కారణాలతో నాసా దానిని తప్పించింది. ఇక కాంట్రాక్ట్‌లో భాగంగా స్పేస్ఎక్స్ ‘US డీఆర్బిట్ వెహికల్’ను నిర్మించనుంది. ISS శకలాలు జనసంచార ప్రాంతాల్లో పడకుండా జాగ్రత్తలు తీసుకోనుంది.
Similar News
News October 23, 2025
అకాలపు వాన.. అరికల కూడు

ఇప్పుడు మనకు సాధారణంగా కనిపించే వరి అన్నం ఒకప్పుడు చాలా అరుదు. కేవలం ధనికుల ఇళ్లలోనే వండుకునేవారు. సామాన్యులు ఎక్కువగా అరికల అన్నం తినేవారు. కొత్తగా వరి పండించే రోజుల్లో ‘అకాలపు వాన.. అరికల కూడు’ అనే సామెత ప్రాబల్యంలోకి వచ్చినట్లు తెలుస్తోంది. వాన అదును తప్పి కురిస్తే ధనవంతులు కూడా అరికల కూడు తినాల్సిందేనన్నది దీని అర్థం.
☛ మీకు తెలిసిన వ్యవసాయ సామెతలను కామెంట్ చేయండి
News October 23, 2025
నలభై ఏళ్ల తర్వాత మహిళల్లో వచ్చే వ్యాధులివే..

40 ఏళ్ల తర్వాత మహిళల్లో అనేక వ్యాధులొచ్చే ముప్పు పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. పని ఒత్తిడి, ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల పలు శారీరక, మానసిక వ్యాధులొస్తాయంటున్నారు. ముఖ్యంగా బోలుఎముకలవ్యాధి, గుండె జబ్బులు, రొమ్ము క్యాన్సర్, మానసిక ఒత్తిడి దాడి చేస్తాయంటున్నారు. శరీరంలో హార్మోన్ల మార్పులే వీటికి కారణమంటున్నారు. కాబట్టి మహిళలు 40 తర్వాత తరచూ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు.
News October 23, 2025
పూర్తి బకాయిలు చెల్లించేవరకు ఆందోళనలు: నెట్‌వర్క్ ఆసుపత్రులు

AP: ఎన్టీఆర్ వైద్య సేవ పథకానికి రూ.250 కోట్లు <<18076438>>రిలీజ్<<>> చేసినా నెట్‌వర్క్ ఆసుపత్రులు వెనక్కి తగ్గలేదు. తాము డిమాండ్ చేస్తున్న రూ.2,700 కోట్ల పూర్తి బకాయిలను చెల్లించాలని ఆసుపత్రుల అసోసియేషన్ కోరింది. పూర్తి బకాయిలు చెల్లించేవరకు ఆందోళన కొనసాగుతుందని ప్రకటించింది. ప్రభుత్వం విడుదల చేసిన వాటితో సరిపెట్టుకోలేమని స్పష్టం చేసింది. దీంతో ఇవాళ ‘చలో విజయవాడ మహాధర్నా’ యథాతథంగా ఉంటుందని పేర్కొంది.