News May 12, 2024
కుంకుమ పువ్వునకు భారీ డిమాండ్

దేశంలో కుంకుమ పువ్వునకు డిమాండ్ భారీగా పెరిగింది. సరఫరా తగ్గడంతో కిలో పువ్వు ఏకంగా రూ.5 లక్షలు పలుకుతోంది. వంటల నుంచి సౌందర్య సాధనాల వరకు పలు ఉత్పత్తుల్లో దీన్ని వినియోగిస్తుంటారు. ప్రపంచవ్యాప్తంగా కుంకుమ పువ్వు ఉత్పత్తిలో 90శాతం ఇరాన్ నుంచే వస్తుంది. గత కొంతకాలంగా పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా అక్కడి నుంచి సరఫరా బాగా తగ్గింది. ఈ నేపథ్యంలో డిమాండ్ పెరిగిందంటున్నారు పరిశీలకులు.
Similar News
News November 22, 2025
మెదక్: పంచాయతీ ఎన్నికలపై జీవో జారీ.. అధికారుల చర్యలు

రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమైంది.పంచాయతీ రిజర్వేషన్లపై డెడికేటెడ్ కమిషన్ నివేదికను రాష్ట్ర కేబినెట్ ఆమోదించింది. రిజర్వేషన్లు 50శాతం మించకుండా కొత్త ప్రతిపాదనలను కమిషన్ సమర్పించింది. ఈ జీవో ఆధారంగా నేడు, రేపు వార్డుల రిజర్వేషన్లు, ఎంపీడీవో, సర్పంచ్ల రిజర్వేషన్లు ఖరారు చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేసే దిశగా మెదక్ అధికారులు చర్యలు చేపట్టారు.
News November 22, 2025
‘పండ్లు, కూరగాయల సాగుతో ఎక్కువ లాభం’

నారింజ పంట ఉత్పత్తికి నాణ్యమైన విత్తనాల కోసం నాగ్‌పూర్‌లో రూ.70 కోట్లతో క్లీన్‌ప్లాంట్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ తెలిపారు. భూసార పరీక్షలు, నాణ్యమైన విత్తనాలను అందజేయడంపై ICAR సైంటిస్టులు దృష్టిపెట్టాలన్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందాలంటే పండ్లు, కూరగాయ పంటలను సాగు చేయాలని.. యంత్రాలు, డ్రిప్ ఇరిగేషన్ వాడకంపై రైతులు అవగాహన పెంచుకోవాలని సూచించారు.
News November 22, 2025
ఇంగ్లండ్ ఆలౌట్.. ఆసీస్ టార్గెట్ ఎంతంటే?

యాషెస్ సిరీస్ తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 164 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఇంగ్లిష్ బ్యాటర్లను తక్కువ స్కోర్‌కే కట్టడి చేయడంలో ఆస్ట్రేలియా బౌలర్లు సక్సెస్ అయ్యారు. పోప్(33), డకెట్(28), జేమీ స్మిత్(15), అట్కిన్సన్(37), కార్స్(20) మినహా ఎవరూ పెద్దగా రాణించలేదు. ఆసీస్ బౌలర్లలో బోలాండ్ 4, స్టార్క్, డగ్గెట్ చెరో 3 వికెట్లు తీశారు. విజయం కోసం ఆస్ట్రేలియా 205 పరుగులు చేయాల్సి ఉంటుంది.


