News February 20, 2025

‘ఛావా’ తెలుగు వెర్షన్‌కు భారీ డిమాండ్!

image

ఇండస్ట్రీ ఏదైనా కంటెంట్ నచ్చితే చాలు తెలుగు ప్రేక్షకులు ఆ సినిమాను హిట్ చేస్తుంటారు. ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులు బాలీవుడ్ సినిమా ‘ఛావా’కు మంత్రముగ్ధులవుతున్నారు. చాలా మంది హిందీ రాకపోయినా శంభాజీ చరిత్ర తెలుసుకునేందుకు థియేటర్లకు వెళ్తున్నారు. తెలుగులో విడుదల చేయాలని లేదా OTTలోనైనా తెలుగు వెర్షన్‌ను అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు. దీంతో ‘ఛావా’ తెలుగు విడుదలకు భారీగా డిమాండ్ ఏర్పడింది.

Similar News

News December 4, 2025

వాస్తును నమ్మవచ్చా?

image

వాస్తుపై ప్రజల్లో భిన్నాభిప్రాయాలున్నాయి. కొందరు దీన్ని నిజమని నమ్ముతారు. మరికొందరు మూఢనమ్మకమని అభిప్రాయపడతారు. అయితే వాస్తు అనేది ఓ శాస్త్రమని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు చెబుతున్నారు. ‘ఇది కేవలం ఓ నమ్మకం కాదు. జీవన మనుగడకు అవసరమైన పంచభూతాలను ఈ శాస్త్రం సమన్వయం చేస్తుంది. నివాసయోగ్యత కోసం మనం నివసించే ప్రదేశాలలో ఈ పంచభూతాల సమతుల్యత కోసం వాస్తును పాటించాలి’ అని అంటున్నారు. <<-se>>#Vasthu<<>>

News December 4, 2025

హార్టికల్చర్ హబ్‌కి కేంద్రం ₹40వేల కోట్లు: CBN

image

AP: హార్టికల్చర్ హబ్‌గా 9 జిల్లాలను తయారుచేస్తున్నామని CM CBN తెలిపారు. దీనికోసం కేంద్రం పూర్వోదయ స్కీమ్ కింద ₹40వేల కోట్లు ఇస్తోందని చెప్పారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని పెట్టుబడుల్ని ఆకర్షించాలని చెప్పారు. అధికారులు టెక్నాలజీపై గ్రిప్ పెంచుకోవాలన్నారు. 7వ తరగతి నుంచే AI బేసిక్స్‌పై బోధన ఉండాలని సూచించారు. విశాఖ కాపులుప్పాడలో హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్ల కోసం 50 ఎకరాలు కేటాయించాలని చెప్పారు.

News December 4, 2025

తెలుగు చదువుకుంటేనే ఉద్యోగం.. వెంకయ్య కీలక వ్యాఖ్యలు

image

AP: తాను చదువుకునే రోజుల్లో అవగాహన లేక హిందీ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నానని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య చెప్పారు. మాతృభాషకు ప్రాధాన్యం ఇచ్చి, ఆ తర్వాత సోదర భాషలు నేర్చుకోవాలని పిలుపునిచ్చారు. మచిలీపట్నం కృష్ణా వర్సిటీలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘AP, TGలు తెలుగును పరిపాలనా భాషగా చేసుకోవాలి. తెలుగు చదువుకుంటేనే ఉద్యోగం ఇస్తామని చెప్పాలి. అప్పుడే తెలుగు వెలుగుతుంది’ అని పేర్కొన్నారు.