News September 13, 2024
కస్టమర్లకు కార్ల సంస్థల భారీ డిస్కౌంట్లు

కార్ల తయారీ సంస్థలు కస్టమర్లకు భారీ డిస్కౌంట్లు ప్రకటిస్తున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుతం డిస్కౌంట్లు సగటున 12శాతం మేర పెరిగాయి. సంస్థ ఆఫర్లు రూ.20 వేల మొదలు రూ.3.15 లక్షల వరకు ఉన్నాయి. జాటో డైనమిక్స్ సమాచారం ప్రకారం టయోటా, హోండా సంస్థలు గత ఏడాదితో పోలిస్తే డిస్కౌంట్లను రెండింతలు పెంచాయి. ఇక అత్యధికంగా జీప్ సంస్థ కంపాస్పై రూ.3.15 లక్షల డిస్కౌంట్ను అందిస్తోంది.
Similar News
News November 21, 2025
జంగారెడ్డిగూడెంలో విద్యార్థిని ఆత్మహత్య

జంగారెడ్డిగూడెంలో గురుకుల పాఠశాల హాస్టల్లో టెన్త్ చదువుతున్న విద్యార్థిని శుక్రవారం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. లంచ్ టైంలో హాస్టల్ గదిలోకి వెళ్లి ఉరి వేసుకుంది వెంటనే ఉపాధ్యాయులు విద్యార్థినిని జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆత్మహత్యకు కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
News November 21, 2025
జక్కన్నపై దేవుడికి లేని కోపం మీకెందుకు: RGV

నాస్తికుడిగా ఉండటం నేరం కాదని రాజమౌళిపై విషం చిమ్మేవారు తెలుసుకోవాలని RGV పేర్కొన్నారు. ‘దేవుణ్ని నమ్మనివాడు ఆయనపై మూవీ తీయడమేంటని ప్రశ్నిస్తున్నారు. గ్యాంగ్స్టర్ మూవీ తీయాలంటే డైరెక్టర్ గ్యాంగ్స్టర్ అవ్వాలా? నిజమేంటంటే నమ్మని వ్యక్తికే దేవుడు వందరెట్లెక్కువ సక్సెస్ ఇచ్చాడు. అంటే దేవుడు మీ కంటే నాస్తికులనే ఎక్కువ ప్రేమిస్తుండాలి. మరి రాజమౌళితో దేవుడికిలేని ఇబ్బంది మీకెందుకు’ అని ట్వీట్ చేశారు.
News November 21, 2025
రాష్ట్రంలో 32మంది IPSల బదిలీ

TG: పంచాయతీ ఎన్నికల వేళ 32మంది IPSలను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ADG పర్సనల్గా చౌహాన్, CID DIGగా పరిమళ నూతన్, మహేశ్వరం DCPగా నారాయణరెడ్డి, తెలంగాణ నార్కోటిక్ SPగా పద్మ, నాగర్ కర్నూల్ SPగా సంగ్రామ్ పాటిల్, సౌత్ జోన్ DCPగా కిరణ్ కారే, వనపర్తి SPగా సునీత, మల్కాజ్గిరి DCPగా శ్రీధర్, ఆసిఫాబాద్ SPగా నిఖితా పంత్, TG యాంటీ నార్కోటిక్స్ బ్యూరో SPగా గిరిధర్ తదితరులు బదిలీ అయ్యారు.


