News November 25, 2024
అండమాన్ జలాల్లో భారీగా డ్రగ్స్ సీజ్
అండమాన్ జలాల్లో నేడు భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఫిషింగ్ బోట్లలో తరలిస్తుండగా 5 టన్నుల డ్రగ్స్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇండియన్ కోస్ట్‌గార్డ్ చరిత్రలోనే భారీ మొత్తంలో డ్రగ్స్ పట్టుబడినట్లు తెలుస్తోంది.
Similar News
News November 25, 2024
లగచర్లకు రేవంత్ వెళ్లుంటే ఉరికించి కొట్టేవారు: KTR
TG: ఫార్మా విలేజ్ కోసం 3వేల ఎకరాల భూములు తీసుకుంటామంటే లగచర్ల గిరిజన రైతులు సీఎం రేవంత్ మీద తిరగబడ్డారని KTR అన్నారు. 9 నెలలుగా నిరసన తెలుపుతున్న రైతులతో మాట్లాడటానికి సమయం లేదా అని సీఎంను ప్రశ్నించారు. లగచర్లకు అధికారులు వెళ్తే వ్యతిరేకించారని, అదే రేవంత్ వెళ్లుంటే ఉరికించి కొట్టేవారని చెప్పారు. అదానీ, అల్లుడు, తమ్ముడు, అన్న కోసం రేవంత్ పని చేస్తున్నారని మహబూబాబాద్‌లో ఫైరయ్యారు.
News November 25, 2024
28న ఓటీటీలోకి ‘లక్కీ భాస్కర్’
వెంకీ అట్లూరి డైరెక్షన్లో దుల్కర్ సల్మాన్-మీనాక్షి చౌదరి నటించిన ‘లక్కీ భాస్కర్’ మూవీ ఓటీటీలోకి రానుంది. ఈ నెల 28 నుంచి తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు నెట్‌ఫ్లిక్స్ వెల్లడించింది. గత నెల 31న విడుదలైన ఈ సినిమా రూ.100 కోట్లకుపైగా కలెక్షన్లు సాధించి సూపర్‌హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే.
News November 25, 2024
అదానీ అంశంపై రచ్చ: బుధవారానికి వాయిదాపడ్డ పార్లమెంటు
పార్లమెంటు ఉభయసభలు బుధవారానికి వాయిదా పడ్డాయి. లోక్‌సభ, రాజ్యసభ ఆరంభమైన కాసేపటికే ఇండియా కూటమి సభ్యులు ఆందోళనకు దిగారు. గౌతమ్ అదానీపై న్యూయార్క్ కోర్టులో అభియోగాల నమోదుపై చర్చించాలని పట్టుబట్టారు. JPC వేయాలని డిమాండ్ చేశారు. పరిస్థితి సద్దుమణగక పోవడంతో లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ సభలను వాయిదా వేశారు.