News January 25, 2025
MHలో భారీ పేలుడు.. 8కి చేరిన మృతుల సంఖ్య
మహారాష్ట్ర భండారాలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో జరిగిన భారీ <<15243613>>పేలుడు<<>> ఘటనలో మృతుల సంఖ్య 8కి చేరినట్లు నాగపూర్ పోలీసులు వెల్లడించారు. ఉ.11గంటలకు ఘటన జరగ్గా, సహాయక చర్యలకు 8గంటల సమయం పట్టిందన్నారు. ఘటన జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో ఉన్న 13మందిలో 8మంది చనిపోగా, మరో ఐదుగురికి గాయాలయ్యాయని చెప్పారు. ప్రమాదం పట్ల విచారం వ్యక్తం చేసిన ఆ రాష్ట్ర CM ఫడణవీస్ మృతుల కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.
Similar News
News January 26, 2025
పెరిగిన చికెన్ ధర
TG: రిపబ్లిక్ డే సందర్భంగా రాష్ట్రంలోని మాంసం దుకాణాలు మూసివేయాలని ఆదేశాలున్నా చాలాచోట్ల తెరిచే ఉన్నాయి. ఆదివారం కావడంతో ప్రజలు కూడా భారీగా కొనుగోళ్లు చేస్తున్నారు. దీంతో రేట్లు పెరిగినట్లు తెలుస్తోంది. గత వారం వరకు కేజీ చికెన్ ధర రూ.230-240 ఉండగా ఇవాళ రూ.280-300కు చేరింది. కొన్ని ప్రాంతాల్లో మాత్రం రూ.250లోపే పలుకుతోంది. మరి మీ ప్రాంతంలో చికెన్ ధరలు ఎలా ఉన్నాయి?
News January 26, 2025
జాతీయ జెండాను ఆవిష్కరించిన రాష్ట్రపతి
ఢిల్లీలోని కర్తవ్యపథ్లో గణతంత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కఢ్, ప్రధాని మోదీ, లోక్సభ స్పీకర్ ఓంబిర్లా, కేంద్రమంత్రులు, ప్రతిపక్ష నేతలు, రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.
News January 26, 2025
యుద్ధ వీరులకు ప్రధాని మోదీ నివాళి
ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకం వద్ద ప్రధాని మోదీ నివాళి అర్పించారు. దేశ స్వాతంత్ర్య పోరాటంలో ప్రాణాలు అర్పించిన వీర సైనికుల త్యాగాలను మోదీ స్మరించుకున్నారు. ఆయన వెంట రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, త్రివిధ దళాధిపతులు ఉన్నారు. అనంతరం ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు.