News March 24, 2025

ఎలుక వల్ల భారీగా షేర్ల పతనం!

image

అద్భుతంగా రాణిస్తున్న కంపెనీ షేర్లు ఒక్కసారిగా పడిపోయాయంటే ఆదాయం తగ్గడమో, ప్రపంచ మార్కెట్ ట్రెండ్లో కారణమని అనుకుంటాం. కానీ జపాన్‌కు చెందిన జెన్షో హోల్డింగ్స్ కో అనే రెస్టారెంట్ చెయిన్ షేర్ విలువ మాత్రం ఎలుక కారణంగా పడిపోయింది. ఆ సంస్థకు చెందిన ఓ శాఖలో కస్టమర్‌కి సూప్‌లో ఎలుక వచ్చింది. అతడి ఫిర్యాదుతో హోటల్‌లో పరిశుభ్రతపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి. దీంతో కంపెనీ షేర్లు 7.1శాతం మేర పతనమయ్యాయి.

Similar News

News November 26, 2025

2 కోట్ల ఆధార్ ఐడీల తొలగింపు.. కారణమిదే!

image

దేశవ్యాప్తంగా 2 కోట్ల ఆధార్ ఐడీలను UIDAI డీయాక్టివేట్ చేసిందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. డేటా క్లీనింగ్‌లో భాగంగా చనిపోయిన వ్యక్తుల వివరాలను డిసేబుల్ చేసినట్లు చెప్పింది. ఆధార్ దుర్వినియోగాన్ని నిరోధించేందుకు ఇలా చేసినట్లు పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వ శాఖలు, భారత రిజిస్ట్రార్ జనరల్ నుంచి వచ్చిన డెత్ రిజిస్ట్రేషన్లు, ఇతర సమాచారం ఆధారంగా డీయాక్టివేట్ చేసినట్లు వెల్లడించింది.

News November 26, 2025

బాలిస్టిక్ క్షిపణి పరీక్షించిన పాకిస్థాన్

image

యాంటీ షిప్ బాలిస్టిక్ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించినట్లు పాకిస్థాన్ మిలిటరీ ప్రకటించింది. ‘స్థానికంగా నిర్మించిన నేవల్ ప్లాట్‌ఫామ్ నుంచి మిస్సైల్ పరీక్షించాం. సముద్రం, భూమిపై ఉన్న లక్ష్యాలను ఇది అత్యంత కచ్చితత్వంతో ఛేదించగలదు. ఇందులో అత్యాధునిక గైడెన్స్ వ్యవస్థలు ఉన్నాయి’ అని పేర్కొంది. కాగా మే నెలలో భారత్ నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ తర్వాతి నుంచి పాకిస్థాన్ ఈ తరహా ప్రయోగాలను పెంచింది.

News November 26, 2025

పుల్లోరం వ్యాధితో కోళ్లకు ప్రమాదం

image

వైరస్, సూక్ష్మజీవుల వల్ల కోళ్లలో పుల్లోరం వ్యాధి సోకుతుంది. కోడి పిల్లల్లో దీని ప్రభావం ఎక్కువ. తల్లి నుంచి పిల్లలకు గుడ్ల ద్వారా సంక్రమిస్తుంది. రోగం సోకిన కోడిపిల్లలు గుంపులుగా గుమికూడటం, శ్వాసలో ఇబ్బంది, రెక్కలు వాల్చడం, మలద్వారం వద్ద తెల్లని రెట్ట అంటుకోవడం వంటి లక్షణాలుంటాయి. కోడిని కోసి చూస్తే గుండె, కాలేయం, పేగులపై తెల్లని మచ్చలు కనిపిస్తాయి. నివారణకు వెటర్నరీ డాక్టర్ సలహాలను పాటించాలి.