News January 25, 2025

దక్షిణ జార్జియాను ఢీకొట్టనున్న భారీ ఐస్‌బర్గ్‌!

image

అంటార్కిటికా నుంచి విడిపోయిన ఓ భారీ మంచుకొండ(A23a) బ్రిటిష్ భూభాగం వైపు దూసుకెళ్తోంది. ఇది మున్ముందు దక్షిణ జార్జియా ద్వీపాన్ని ఢీకొనే అవకాశముంది. ఆ ప్రాంతానికి 280KM దూరంలో ఉన్న ఈ ఐస్‌బర్గ్ బలమైన గాలులు, సముద్ర ప్రవాహాల వల్ల వేగంగా కదులుతోంది. 4K చ.కి.మీ. వైశాల్యం ఉండే మంచుకొండ ఆ ద్వీపాన్ని ఢీకొట్టి అక్కడే చిక్కుకునే ప్రమాదముంది. దీంతో అందులోని పెంగ్విన్లు, సీల్స్‌కు ఆహారం దొరకడం కష్టమవుతుంది.

Similar News

News January 26, 2025

పెరిగిన చికెన్ ధర

image

TG: రిపబ్లిక్ డే సందర్భంగా రాష్ట్రంలోని మాంసం దుకాణాలు మూసివేయాలని ఆదేశాలున్నా చాలాచోట్ల తెరిచే ఉన్నాయి. ఆదివారం కావడంతో ప్రజలు కూడా భారీగా కొనుగోళ్లు చేస్తున్నారు. దీంతో రేట్లు పెరిగినట్లు తెలుస్తోంది. గత వారం వరకు కేజీ చికెన్ ధర రూ.230-240 ఉండగా ఇవాళ రూ.280-300కు చేరింది. కొన్ని ప్రాంతాల్లో మాత్రం రూ.250లోపే పలుకుతోంది. మరి మీ ప్రాంతంలో చికెన్ ధరలు ఎలా ఉన్నాయి?

News January 26, 2025

జాతీయ జెండాను ఆవిష్కరించిన రాష్ట్రపతి

image

ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో గణతంత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌కఢ్, ప్రధాని మోదీ, లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా, కేంద్రమంత్రులు, ప్రతిపక్ష నేతలు, రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.

News January 26, 2025

యుద్ధ వీరులకు ప్రధాని మోదీ నివాళి

image

ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకం వద్ద ప్రధాని మోదీ నివాళి అర్పించారు. దేశ స్వాతంత్ర్య పోరాటంలో ప్రాణాలు అర్పించిన వీర సైనికుల త్యాగాలను మోదీ స్మరించుకున్నారు. ఆయన వెంట రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, త్రివిధ దళాధిపతులు ఉన్నారు. అనంతరం ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు.