News March 23, 2025
EVల బీమాకు భారీగా పెరిగిన డిమాండ్

ఎలక్ట్రిక్ వాహనాల బీమాకు డిమాండ్ గణనీయంగా పెరిగింది. గత మూడేళ్లలో 16 రెట్లు పెరిగినట్లు పాలసీబజార్ అంతర్గత డేటా చెబుతోంది. EV కార్ల బీమా పాలసీల వాటా FY23లో కేవలం 0.50%గా ఉండగా, మార్చి 2025 నాటికి 14%కి విస్తరించి 8.2% వద్ద నిలిచింది. ఢిల్లీ, బెంగళూరు, పుణే, చెన్నై, ముంబై సిటీల్లో ఈవీల వాడకం ఎక్కువగా ఉందని, 55% బీమా పాలసీలు ఈ నగరాల్లోనే కొనుగోలు చేస్తున్నట్లు పాలసీ బజార్ నివేదిక పేర్కొంది.
Similar News
News March 24, 2025
నేడు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు

TG: నేడు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడతాయని వాతావరణశాఖ అంచనా వేసింది. ఈ క్రమంలో 15 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, వరంగల్, జనగామ, సిద్దిపేట, రంగారెడ్డి, HYDలో వర్షాలు పడతాయంది. దీంతో ఇవాళ, రేపు పగటి ఉష్ణోగ్రతలు తగ్గుతాయని వెల్లడించింది. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
News March 24, 2025
సొరంగం కూలిన 7 నిమిషాల్లోనే 8 మంది మృతి?

TG: ఫిబ్రవరి 22న SLBC సొరంగం కూలి 8 మంది చిక్కుకుపోయిన ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సొరంగం కూలిన 7 నిమిషాల్లోనే అందరూ మృతి చెందినట్లు అధికారులు అంచనాకు వచ్చారని, ఈ మేరకు నేడు CMతో జరిగే సమీక్షలో వెల్లడించనున్నట్లు సమాచారం. బురద వల్ల మృతదేహాలు కుళ్లిపోయి ఉంటాయని భావిస్తున్నారు. కాగా, 8మందిలో ఒకరి మృతదేహాన్ని వెలికితీసిన విషయం తెలిసిందే. మరోవైపు సొరంగంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
News March 24, 2025
31 కంపార్టుమెంట్లలో శ్రీవారి భక్తులు

AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేనివారికి శ్రీవారి సర్వదర్శనానికి 12గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూకాంప్లెక్స్లోని
31 కంపార్టుమెంట్లలో వేంకటేశ్వరుడి దర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 84,198 మంది దర్శించుకోగా, 25,665 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.94 కోట్లు వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది.