News February 1, 2025

భారీగా పెరిగిన జీఎస్టీ కలెక్షన్లు

image

దేశంలో జనవరి నెలకు సంబంధించి జీఎస్టీ వసూళ్లు భారీగా పెరిగాయి. 12.3శాతం పెరిగి రూ.1,95,506 కోట్లకు చేరినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇందులో దేశీయ లావాదేవీలతో సమకూరిన జీఎస్టీ రూ.1.47 లక్షల కోట్లు కాగా, దిగుమతి వస్తువులపై విధించిన పన్నులతో వచ్చిన ఆదాయం రూ.48,382 కోట్లుగా ఉంది. రీఫండ్స్ కింద రూ.23,853 కోట్లు విడుదల చేయగా, చివరకు వసూళ్లు రూ.1.72 లక్షల కోట్లుగా ఉన్నాయి.

Similar News

News December 27, 2025

VHT: రోహిత్‌, కోహ్లీల శాలరీ ఎంతంటే?

image

విజయ్ హజారే ట్రోఫీలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆడుతుండటంతో వారికి ఎంత శాలరీ వస్తుందన్న చర్చ జరుగుతోంది. లిస్ట్-A మ్యాచ్‌లు 40కు మించి ఆడిన సీనియర్ కేటగిరీ క్రికెటర్లకు ఒక్కో మ్యాచ్‌కు రూ.60K ఇస్తారు. రిజర్వ్‌లో ఉంటే రూ.30K చెల్లిస్తారు. కోహ్లీ, రోహిత్ సీనియర్ కేటగిరీ ప్లేయర్లే కాబట్టి రూ.60K చెల్లిస్తారు. IPLతో పోలిస్తే చాలా తక్కువే అయినా దేశవాళీ క్రికెట్‌లో ఇది మంచి ఫీజు అనే చెప్పుకోవచ్చు.

News December 27, 2025

యూరియా కష్టాలు.. చిన్న ఫోన్లలో యాప్ ఎలా?

image

తెలంగాణలో దాదాపు 60% రైతుల దగ్గర స్మార్ట్ ఫోన్లు లేకపోవడంతో యూరియా కష్టాలు తప్పడం లేదు. వారి చిన్న ఫోన్ నంబర్లకే ఆధార్, భూముల వివరాలు లింకై ఉన్నాయి. ఫోన్ మార్చితే పథకాలు రద్దవుతాయని భయపడుతున్నారు. ఫలితంగా స్మార్ట్ ఫోన్ కొని యూరియా యాప్ డౌన్‌లోడ్ చేసుకోలేకపోతున్నారు. దళారులను ఆశ్రయిస్తున్నారు. దీనిపై అధికారులు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

News December 27, 2025

‘మేకపోతుల బలి’ రాజకీయం!

image

AP: ఈ నెల 21న జగన్ పుట్టినరోజు సందర్భంగా చాలా చోట్ల YCP కార్యకర్తలు, అభిమానులు మేకపోతులను బలి ఇచ్చారు. వాటి రక్తాన్ని జగన్ ఫ్లెక్సీలపై చల్లుతూ, రప్పారప్పా నినాదాలు చేశారు. దీనిపై ప్రభుత్వం ఆగ్రహంగా ఉంది. ఇవాళ తూ.గో. జిల్లాలో ఏడుగురు కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా సినిమా రిలీజ్‌ల సందర్భంగా హీరోల ఫ్లెక్సీలపై రక్తం చల్లితే తప్పు లేదా అని వైసీపీ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు.