News March 30, 2024

భారీగా పెరిగిన నిమ్మకాయల ధరలు

image

TG: రోజురోజుకు ఎండలు పెరుగుతుండటంతో నిమ్మకాయల ధరలకు రెక్కలొచ్చాయి. కొద్ది రోజుల క్రితం వరకు రూ.20కి అరడజను పెద్దసైజు నిమ్మకాయలు ఇచ్చేవారు. ఇప్పుడు రూ.40-రూ.50కి అమ్ముతున్నారు. విడిగా అయితే పెద్దసైజు నిమ్మకాయ రూ.10, చిన్న సైజుదైతే రూ.5 చొప్పున విక్రయిస్తున్నారు. నిమ్మకాయల ఉత్పత్తి తగ్గడం, డిమాండ్ పెరగడమే ఇందుకు కారణమని వ్యాపారులు చెబుతున్నారు.

Similar News

News November 3, 2025

డ్రాగన్ ఫ్రూట్‌తో మహిళలకు ఎన్నో లాభాలు

image

కలర్‌ఫుల్‌గా కనిపించే డ్రాగన్‌ ఫ్రూట్‌‌లో అనేక పోషకాలుంటాయి. ఇవి మహిళల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయంటున్నారు నిపుణులు. మహిళల్లో ఐరన్, ఫోలేట్, విటమిన్ సి లోపాన్ని భర్తీ చేస్తుంది. ముఖ్యంగా మెనోపాజ్‌ సమయంలో ఆస్టియో పోరోసిస్‌ ప్రమాదం ఎక్కువ. డ్రాగన్‌ ఫ్రూట్‌ను రెగ్యులర్‌గా తీసుకుంటే మెగ్నీషియం, క్యాల్షియం అంది ఎముకలు బలంగా తయారవుతాయి. అలాగే శరీరంలో కొల్లాజెన్‌ ఉత్పత్తి పెంచుతుందని చెబుతున్నారు.

News November 3, 2025

ఈ నెల 15 వరకు ఇంటర్ కాలేజీల్లో తనిఖీలు

image

TG: ఇంటర్ కాలేజీల్లో అకాడమిక్ తనిఖీలు ఈ నెల 15 వరకు పూర్తి చేయాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది. కాలేజీల్లో ప్రమాణాలను మెరుగుపర్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రైవేటు, గురుకులాలు, మోడల్ స్కూళ్లు, కేజీబీవీల్లో తనిఖీలు చేసేందుకు షెడ్యూల్ విడుదల చేశారు. కాలేజీల నిర్వహణ తీరు, రికార్డుల తనిఖీ, సిబ్బంది వివరాలు, విద్యార్థుల అటెండెన్స్‌ను పరిశీలించనున్నారు.

News November 3, 2025

ఏపీ అప్డేట్స్

image

* ఈ నెల 20న తిరుమలకు రానున్న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, 21న శ్రీవారి దర్శనం
* నేడు లండన్‌లో పారిశ్రామికవేత్తలతో భేటీ కానున్న సీఎం చంద్రబాబు
* కుల, చేతివృత్తిదారులకు ఎలాంటి పరికరాలు(ఆదరణ 3.0) అందించాలనే విషయమై మంత్రి సవిత అధ్యక్షతన నేటి నుంచి 3 రోజుల పాటు సమావేశాలు
* ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలని ప్రైవేట్ డిగ్రీ కాలేజీల డిమాండ్