News June 21, 2024

భారీగా పెరిగిన ఎన్ఆర్ఐ డిపాజిట్లు!

image

విదేశాల్లోని భారతీయులు పెద్ద మొత్తంలో NRI డిపాజిట్ స్కీమ్స్‌లో మదుపు చేస్తున్నారు. ఏప్రిల్‌లో $1.08 బిలియన్లు డిపాజిట్ కావడంతో ఆ మొత్తం $152 బిలియన్లకు చేరినట్లు RBI వెల్లడించింది. ఫారిన్ కరెన్సీ నాన్ రెసిడెంట్ (బ్యాంక్స్)లో $26 బిలియన్లు, నాన్ రెసిడెంట్ ఎక్స్‌టెర్నల్ రూపీ అకౌంట్‌లో $99 బిలియన్లు, నాన్ రెసిడెంట్ ఆర్డినరీ డిపాజిట్ స్కీమ్స్‌లో $27 బిలియన్లు వెచ్చించినట్లు తెలిపింది.

Similar News

News October 8, 2024

BIG BREAKING: బీజేపీ సంచలన విజయం

image

ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ హరియాణాలో బీజేపీ సంచలన విజయం సాధించింది. వరుసగా మూడోసారి అధికారాన్ని చేజిక్కించుకుని హ్యాట్రిక్ కొట్టింది. తొలుత కాంగ్రెస్ భారీ ఆధిక్యంలో దూసుకెళ్లినా క్రమంగా కమలం రేసులోకి వచ్చింది. ఇక అప్పటినుంచి వరుసగా సీట్లు గెలుస్తూ మ్యాజిక్ ఫిగర్ (46) దాటింది. EC లెక్కల ప్రకారం 90 సీట్లకు గాను BJP 46, కాంగ్రెస్ 35 చోట్ల గెలిచాయి. చెరో 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.

News October 8, 2024

బీజేపీని గెలిపించిన 200 రోజుల ముఖ్య‌మంత్రి

image

ఎన్నిక‌ల‌కు 200 రోజుల ముందు హరియాణా CMగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన నాయ‌బ్ సింగ్ సైనీ BJPని అనూహ్యంగా విజ‌య‌తీరాల‌కు చేర్చారు. డ‌మ్మీ CM అని ఎన్ని విమ‌ర్శ‌లు వ‌చ్చినా BJP ఎన్నిక‌ల ప్ర‌చారం మొత్తం ఆయ‌న చుట్టూనే తిరిగింది. ఫ‌లితాల‌పై ముందుగానే బాధ్య‌త వ‌హించిన సైనీ ప్రభుత్వ వ్యతిరేకతలోనూ పార్టీని ముందుండి నడిపారు. అంచనాలను తలకిందులు చేస్తూ బీజేపీ హ్యాట్రిక్ విజయానికి కార‌ణ‌మ‌య్యారు.

News October 8, 2024

జమ్మూ ప్రజలు మాతోనే ఉన్నారు: కిషన్ రెడ్డి

image

జమ్మూ ప్రాంతంలో బీజేపీ విజయం చరిత్రాత్మకం అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. గతంలో కంటే ఎక్కువ సీట్లు, ఓట్లు పొందామని తెలిపారు. జమ్మూలో 43 అసెంబ్లీ సీట్లలో బీజేపీ 29 స్థానాలు గెలుచుకుందని, కాంగ్రెస్ కేవలం ఒక్క సీటు మాత్రమే సాధించిందని పేర్కొన్నారు. జమ్మూ ప్రజలు తమతోనే ఉన్నారని మరోసారి నిరూపితమైందని వివరించారు. కాగా, J&Kలో కాంగ్రెస్, ఎన్సీ కూటమి గెలవగా, జమ్మూ ప్రాంతంలో బీజేపీ సత్తా చాటింది.