News June 19, 2024
భారీగా పెరిగిన రైల్వే పోస్టులు

అసిస్టెంట్ లోకో పైలట్ల పోస్టుల సంఖ్యను భారీగా పెంచుతున్నట్లు RRB ప్రకటించింది. తొలుత 5,696 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వగా తాజాగా 18,799 పోస్టులు భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. అత్యధికంగా సౌత్ సెంట్రల్ రైల్వే (సికింద్రాబాద్)లో 1,364 పోస్టులు పెరిగాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే అప్లికేషన్ ప్రక్రియ పూర్తి కాగా, జులై-ఆగస్టులో CBT-1 పరీక్ష ఉండనుంది. పూర్తి వివరాలకు https://www.rrbcdg.gov.in/ సైట్ చూడండి.
Similar News
News December 3, 2025
నామినేషన్ స్వీకరణ ప్రక్రియను సజావుగా చేపట్టాలి: అ.కలెక్టర్

గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ స్వీకరణ ప్రక్రియను అధికారులు సజావుగా చేపట్టాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా.శ్రీజ అన్నారు. బుధవారం తల్లాడ మండలంలో పర్యటించిన అదనపు కలెక్టర్.. రిటర్నింగ్ అధికారి కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. నామినేషన్ వేసే అభ్యర్థులు సమన్వయంతో అధికారులకు సహకరించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు పాల్గొన్నారు.
News December 3, 2025
PM మోదీకి CM రేవంత్ అందించిన వినతులివే

⋆HYD మెట్రో రెండో దశ విస్తరణను కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ వెంచర్గా చేపట్టేందుకు ఆమోదించాలి
⋆RRR ఉత్తర, దక్షిణ భాగం నిర్మాణానికి, మన్ననూర్-శ్రీశైలం 4 వరుసల ఎలివేటేడ్ కారిడార్కు అనుమతులివ్వాలి. RRR వెంట రీజనల్ రింగ్ రైలు ప్రాజెక్టును చేపట్టాలి
⋆HYD-అమరావతి-మచిలీపట్నం పోర్ట్ 12 లేన్ల గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే, HYD-BLR గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే నిర్మాణానికి చొరవ చూపాలి
News December 3, 2025
ఏఐతో అశ్లీల ఫొటోలు.. X వేదికగా రష్మిక ఫిర్యాదు

అసభ్యకరంగా మార్ఫింగ్ చేసిన తన ఫొటోలు వైరల్ కావడంతో హీరోయిన్ రష్మిక Xలో ఘాటుగా స్పందించారు. ‘AIని అభివృద్ధి కోసం కాకుండా కొందరు అశ్లీలతను సృష్టించడానికి, మహిళలను లక్ష్యంగా చేసేందుకు దుర్వినియోగం చేస్తున్నారు. AIని మంచి కోసం మాత్రమే వాడుకుందాం. ఇలాంటి దుర్వినియోగానికి పాల్పడేవారికి కఠిన శిక్ష విధించాలి’ అని కోరుతూ ‘Cyberdost’కు ట్యాగ్ చేసి ఫిర్యాదు చేశారు.


