News August 31, 2024

దేశంలో భారీగా పెరిగిన నీటి నిల్వలు

image

దేశంలోని రిజర్వాయర్లలో నీటి నిల్వలు భారీగా పెరిగినట్లు కేంద్ర జల సంఘం (CWC) తెలిపింది. గతేడాదితో పోల్చితే ఇది 126 శాతం అధికమని పేర్కొంది. దేశవ్యాప్తంగా రిజర్వాయర్లలో నీటిమట్టం 144.333 బిలియన్ క్యూబిక్ మీటర్ల వద్ద ఉందని తెలిపింది. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళలో నీటి నిల్వలు గణనీయంగా పెరిగినట్లు వెల్లడించింది. ఈ రాష్ట్రాల్లో మొత్తం 44.771 బీసీఎంల నిల్వ ఉన్నట్లు పేర్కొంది.

Similar News

News November 30, 2025

నేడు దండకారణ్యం బంద్.. పోలీసుల అప్రమత్తం

image

హిడ్మా సహా పలువురు మావోల ఎన్‌కౌంటర్‌కు నిరసనగా మావోయిస్టు పార్టీ ఇవాళ దండకారణ్యం బంద్‌కు పిలుపునిచ్చింది. దీంతో మావోలు దాడులకు పాల్పడవచ్చనే అనుమానంతో ఛత్తీస్‌గఢ్ పోలీసులు, కేంద్ర బలగాలు అప్రమత్తమయ్యాయి. బస్తర్ డివిజన్‌లోని 7 జిల్లాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. నేషనల్ పార్క్, పామేడు, అబూజ్‌మడ్ అడవుల్లో కూంబింగ్ చేస్తున్నారు. అలాగే ఏపీ, తెలంగాణలోని ఏజెన్సీ ప్రాంతాల్లోనూ పోలీసులు భద్రతను పెంచారు.

News November 30, 2025

రేవంత్ vs మెస్సీ.. HYDలో ఫుట్‌బాల్ మ్యాచ్

image

TG: రాష్ట్ర ప్రభుత్వం DEC 13న HYDలో నిర్వహిస్తున్న <<18419371>>ఫుట్‌బాల్ మ్యాచులో<<>> అర్జెంటీనా స్టార్ మెస్సీ పాల్గొనబోతున్న విషయం తెలిసిందే. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో జరిగే ఈ మ్యాచులో మెస్సీతో పాటు సీఎం రేవంత్ కూడా పాల్గొననున్నారు. RR-9 టీమ్ తరఫున CM 9వ నంబర్ జెర్సీలో, LM-10 జట్టు తరఫున మెస్సీ 10వ నంబర్ జెర్సీలో బరిలోకి దిగనున్నారు. గ్లోబల్ సమ్మిట్ ముగింపును పురస్కరించుకుని ఈ మ్యాచును నిర్వహిస్తున్నారు.

News November 30, 2025

వయ్యారిభామతో వ్యవసాయానికి పెనుముప్పు

image

పార్థీనియం(వయ్యారిభామ) అత్యంత ప్రమాదకరమైన కలుపు మొక్క. ఇది అతి వేగంగా వ్యాపించి పొలాలను నిర్వీర్యం చేస్తుంది. దీని వల్ల పంట పొలాల్లో 40 శాతం దిగుబడి, పశుగ్రాసాల్లో 90 శాతం దిగుబడి తగ్గుతుంది. ఎరువుల సారాన్ని ఇవి పీల్చేసి పంటకు తీవ్ర నష్టం చేస్తాయి. కొన్ని వైరస్‌లకు ఆశ్రయమిచ్చి పంటల్లో వైరస్ తెగుళ్ల వ్యాప్తికి కారణమవుతాయి. వయ్యారిభామను ఎలా నిర్మూలించాలో తెలుసుకోవడానికి <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.